Petrol-Diesel: పెట్రోల్‌లో ఇథనాలు, డీజిల్‌లో ఐసోబ్యుటానాల్.. కేంద్రం మరో నిర్ణయం.!
- డీజిల్‌లో ఐసోబ్యూటానాల్ బ్లెండింగ్..
- ఇప్పటికే పెట్రోల్‌లో ఇథనాల్..
- భవిష్యత్తులో వచ్చే ఛాన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Petrol-Diesel: ఇరాన్ యుద్ధం, మధ్యప్రాచ్యంలోని పరిణామాలు భారత్‌లో ఇంధన రంగంపై ఒత్తిడి పెరుగుతుంది. ప్రపంచంలో ఎక్కడ ఏ ఘర్షణ జరిగిన అది ప్రత్యక్షంగానో పరోక్షంగానో భారత ఇంధన రంగాన్ని కలవరపరుస్తుంది. ఇదే కాకుండా, 140 కోట్ల జనాభా ఉన్న భారత్ ఇతర దేశాల నుంచి చమురును దిగుమతి చేసుకుంటుంది. దీని వల్ల గణనీయంగా విదేశీ మారకనిల్వల్ని కోల్పోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయాల గురించి కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది.
ఇప్పటికే, పెట్రోల్‌లో ఇథనాల్ కలుపుతోంది. ఇటీవల దేశంలో మొట్టమొదటి ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్(వ్యాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్) ఆవిష్కరణ సందర్భంగా కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. మనం డీజిల్‌లో ఇథనాల్ కలపలేమని, ఇథనాల్ నుంచి ఐసోబ్యూటానాల్ను ఉత్పత్తి చేస్తున్నామని అన్నారు. ఇది డీజిల్‌కు ప్రత్యామ్నాయంగా మారగలదని ఆయన అన్నారు. రెండు జనరేటర్లలో ఒకదాంట్లో ఇథనాల్, మరో దాంట్లో ఐసోబ్యూటానాల్ను విజయవంతంగా పరీక్షించినట్లు చెప్పారు. డీజిల్‌లో 15 శాతం ఐసోబ్యూటానాల్ను కలపడానికి సన్నాహాలు ప్రారంభమైనట్లు ఆయన చెప్పారు. అయితే, ఇప్పటికిప్పుడు డీజిల్‌లో ఈ ఐసోబ్యూటానాల్ కలుపకపోవచ్చు, కానీ భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
- Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
ఏమిటీ ఈ ఐసోబ్యూటానాల్:
ఐసోబ్యూటానాల్ అనేది ఆల్కనాల్ సమూహానికి చెందిన రంగులేని, మండే గుణం ఉన్న ఒక సేంద్రీయ ద్రవం. దీని రసాయన ఫార్ములా C₄H₁₀O. దీనిని డీజిల్‌లో బ్లెండర్‌గా వాడొచ్చు. ఇది డీజిల్‌లో కలపడం వల్ల పర్యావరనానికి ప్రయోజనంగా ఉంటుందని భావిస్తున్నప్పటికీ, ఇది ఎక్కువగా వాడితే ఇంజిన్లను దెబ్బ తీస్తుందని చెబుతున్నారు. ముఖ్యంగా పాత డీజిల్ ఇంజన్లకు ప్రమాకరంగా మారొచ్చు.
సెనేన్ నంబర్ తక్కువ ఉండటమే సమస్యా..?
ఇంధనాలు మండటాన్ని కొలిచే పరిమాణం సెటేన్ నెంబర్. ఇది ఇంజిన్ సిలిండర్‌లో ఇంధనం ఎంత వేగంగా, సులభంగా మండుతుందో చెబుతుంది. సెటేన్ నెంబర్ ఎంత ఎక్కువగా ఉంటే మండే స్వభావం అంత ఎక్కువగా ఉంటుంది. సిలిండర్‌లో ఇంధన వెళ్లినప్పుడు సెటేన్ నెంబర్ ఎక్కువగా ఉంటే ఇంధనం వేగంగా మండి, ఎలాంటి కుదుపులు, కంపనాలు లేకుండా వాహనం నడుస్తుంది. భారత్‌లో విక్రయించే డీజిల్ సాధారణంగా 51 లేదా అంతకన్నా ఎక్కువ సెటేన్ నంబర్ ఉంటుంది. ఇక ఐసోబ్యూటానాల్ సెటేన్ నెంబర్ 15-20 మధ్య ఉంటుంది. ఈ కారణంగా దీనిని డీజిల్‌కు ప్రత్యామ్నాయంగా ఉపయోగించలేరు. అయితే, దీని శక్తి సాంద్రత ఇథనాల్ కంటే ఎక్కువగా ఉండటం వల్ల, దీనిని ఇంధనంతో కలపడానికి మరింత అనుకూలంగా ఉంటుంది.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!