KCR: యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్ రేపు డిశ్చార్జ్ కానున్నారు. అనంతరం అక్కడి నుంచి నంది నగర్ ఇంటికి కేసీఆర్ వెళ్లనున్నారు. సుమారు 6 రోజులుగా యశోద ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్న కేసీఆర్ ఆరోగ్యం కాస్త కుదుట పడటంతో ఆసుపత్రి వర్గాలు ఇంటికి వెల్లడానికి పరిమిషన్ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఇప్పుడు కేసీఆర్ ఆరోగ్యం బాగానే ఉందని, భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రేపు కేసీఆర్ ను డిశ్చార్జ్ చేస్తున్నట్లు వెల్లడించారు.
Read also: Kalki 2898 AD : కల్కిలో ప్రభాస్ మూడు పాత్రలు ఇవేనా ..?
తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో క్రమంగా కోలుకుంటున్నారు. ఇంట్లో జారిపడటంతో తుంటి ఎముక విరిగిపోవడంతో శస్త్రచికిత్స చికిత్స చేశారు యశోద ఆసుపత్రి వైద్యులు. కేసీఆర్ ప్రస్తుతం తన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. కేసీఆర్‌ను పరామర్శించే వారి సంఖ్య పెరుగుతోంది. పలువురు ప్రముఖులు ఆయనను పరామర్శిస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పలువురు కొత్త మంత్రులు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, త్రిదండి చినజీయర్ స్వామి, ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్… కేసీఆర్‌ను పరామర్శించిన వారిలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు, మెగాస్టార్ చిరంజీవి కేసీఆర్‌ను పరామర్శించారు. ఆరోగ్య సమాచారం, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ పరిస్థితుల మధ్య కేసీఆర్ తాజాగా ఓ వీడియోను కూడా విడుదల చేశారు.
Read also: Tesla Humanoid Robot : ఎలాస్ మస్క్ రోబో 2.0 ఆవిష్కరణ.. భలేగుంది బాసూ !
ఈ వీడియో ఆస్పత్రి బెడ్‌పై నుంచి విడుదచేశారు. వివిధ పార్టీల నాయకులు, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, ఆయన అనుచరులు, అభిమానులు, తెలంగాణ సమాజాన్ని ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు. తనను పరామర్శించేందుకు ఎవరూ రావద్దని కోరారు. అయినా కేసీఆర్‌ను చూసేందుకు యశోద అభిమానులు, నాయకులు క్యూ కట్టడంతో యశోద వైద్యులు ఇన్ఫెక్షన్ అవుతుందని పలువురిని నిరాకరించారు. దీంతో యశోద ఆసుప్రతి వద్ద ఆందోళనకు దిగారు. దీంతో రాజ్‌భవన్ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. రవాణా స్థంబిందిచి. అంతేకాదు కేసీఆర్‌ను పరామర్శించేందుకు ఆస్పత్రికి వస్తుండడంతో అక్కడి రోగులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమమంలో రాజ్‌భవన్ రోడ్డును పోలీసులు దిగ్బంధించారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు.
Congress Party: ఘర్ వాపసీపై కాంగ్రెస్ ఫోకస్..!