Kaleshwaram: తెలంగాణ రాష్ట్రంలోని ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేసిన మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి శ్వేతపత్రంపై అసెంబ్లీలో వాడివేడి చర్చ కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఆర్థికమంత్రి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. గత ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టులు.. కాళేశ్వరం నిట్ట నిలువునా చిలిపోయింది అని పేర్కొన్నారు. మేడిగడ్డ కాదు అన్నారం, సుందిళ్ళ ప్రాజెక్టులు కూడా పోతది అని NDSA చెప్పింది అని తెలిపారు. జ్యోతిష్యం కాదు, నిపుణులు చెప్పిన మాట అని మల్లు భట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు.
ఇక, మొబైలైజేషన్ అడ్వాన్స్ తీసుకున్న కాంట్రాక్టర్లతో పని ఎందుకు చేయించలేదు అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. రాజీవ్ సాగర్, దేవాదుల, SRSP పూర్తి చేస్తే 32 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేది వదిలేసి.. లక్ష 72 వేళా కోట్లకు పెంచి కాళేశ్వరం కట్టారని ఆయన పేర్కొన్నారు. మనం ఇల్లు కట్టుకుంటేనే ఇంజనీరింగ్ ను పెట్టుకుంటాం. అలాంటిది, గతంలో కేసీఆర్ కాళేశ్వరం నేనే కడతా అని దాన్ని ఏం చేశారో మనం ఇప్పుడు చూస్తున్నాం.. మీరు కట్టిన కాళేశ్వరం ప్రస్తుతం నిట్ట నిలువునా చీలింది.. గత గవర్నర్ హరీశ్ రావుకు కాళేశ్వర్ రావు అని నీకు పెరు పెట్టారు.. ఇప్పుడు కూలిన దానికి తప్పు ఒప్పుకోండి మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
Read Also: Android 15 : ఆండ్రాయిడ్ 15 వచ్చేసింది.. ఏ ఫోన్ లలో సపోర్ట్ చేస్తుందంటే
ఇక, తుమ్మిడి హట్టి దగ్గర మేము ప్రాజెక్టు కట్టాలనుకున్నాం కాబట్టే మహారాష్ట్ర సీఎంకు లేఖ రాశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. దానికి మహారాష్ట్ర అభ్యంతరం చెప్పింది.. కానీ, మీరు మాత్రం 152 మీటర్ల ఎత్తులో ఉన్న చోట ప్రాజెక్టు కట్టడానికి ఒప్పుకున్నారు అని సంబరాలు చేసుకున్నారు అని ఆయన ప్రశ్నించారు. చివరికి 100 కిలోమీటర్ల కిందికి వచ్చి కాళేశ్వరం కట్టారు.. మోటార్లు ఎక్కడి నుంచి తెచ్చారూ, తెచ్చిన మోటార్లు ఎంతకు తెచ్చారు, రాష్ట్రాన్నీ అప్పుల పాలు చేసి.. ఇప్పుడు తగుదునమ్మ అని మాట్లాడుతున్నాడు హరీష్ రావు అని భట్టి విక్రమార్క వెల్లడించారు.
