telangana budget: తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ బడ్జెట్ ను ప్రవేశ పెట్టనుంది. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో తొలి మూడు నెలల కాలానికి సంబంధించి కేటాయింపులే బడ్జెట్లో ఉన్నాయి.. ఈ ఏడాది మొత్తానికి అంచనాలను ప్రకటించే ఛాన్స్ ఉంది. ఇక, నేడు అసెంబ్లీకి బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ అడుగు పెట్టనున్నారు. ఆయన అసెంబ్లీ సమావేశాలలో ప్రతిపక్ష నాయకుడి హోదాలో పాల్గొంటారు. అసెంబ్లీ సెషన్స్ ప్రారంభం కాగా గత రెండు రోజుల నుంచి కేసీఆర్ ఈ సమావేశాలకు దూరంగా ఉన్నారు.
Read Also: Saturday Stotram: ఈ స్తోత్ర పారాయణం చేస్తే మీ కష్టాలు తీరి కనకవర్షం కురుస్తుంది
అయితే, నేటి నుంచి కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారని బీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నారు. ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ తొలిసారిగా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడంపై ప్రజలలో ఆసక్తి నెలకొంది. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ డిసెంబర్ 8వ తేదీన బాత్రూంలో కాలు జారి పడిపోయారు. దీంతో ఆయన తుంటి ఎముక ఫ్రాక్చర్ కాగా, వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించారు.. ఇక, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కేసీఆర్ చేతి కర్ర సహాయంతో నడుస్తున్నారు. ఇక, రాష్ట్రంలో అధికార పార్టీపై దూకుడు కొనసాగించడానికే కేసీఆర్ నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలకు హాజరు అవుతున్నారని గులాబీ శ్రేణులు ప్రకటించారు.
