KCR-SIT: నేడు సిట్ విచారణకు హాజరుకానున్న మాజీ సీఎం కేసీఆర్!
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
- నేడు సిట్ విచారణకు హాజరుకానున్న కేసీఆర్
- నంది నగర్‌లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు మధ్యాహ్నం సిట్ విచారణకు హాజరుకానున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు హైదరాబాద్ నంది నగర్‌లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఉదయం 9 గంటల తర్వాత ఎర్రవల్లి ఫామ్ హౌస్ నివాసం నుంచి బయలుదేరనున్నారు. ఉదయం 11 గంటల లోపు నంది నగర్ నివాసానికి చేరుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. గత రాత్రి నుంచే మాజీ మంత్రి హరీష్ రావు నంది నగర్లోనే ఉంటున్నారు.
Also Read: Ishan Kishan Century: ఈ సెంచరీని ప్రత్యేకంగా ఏమీ భావించట్లేదు.. నా టార్గెట్ అదే!
Also Read
- Astrology: జూన్ 13 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
- CM Revanth Reddy Flight Diverted: హైదరాబాద్లో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి విమానం బెంగళూరుకు డైవర్ట్
- Family Suicide: ఇంత ఘోరమా? ముక్కుపచ్చలారని పసిబిడ్డల పట్ల విలన్గా మారిన తండ్రి
- TCS Engineer Suicide: TCSలో సీనియర్ల వేధింపులు.. ఉద్యోగి ఆత్మహత్య..
సిట్ విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేసీఆర్ విచారణకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుతంగా నిరసనలు, ధర్నాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. అలాగే ప్రభుత్వ దిష్టి బొమ్మలను దగ్ధం చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. విచారణ జరుగుతున్న సమయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నేతలు తెలంగాణ భవన్‌లో ఉండనున్నారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని క్యాడర్ పెద్ద ఎత్తున తెలంగాణ భవన్‌కు చేరుకోవాలని పార్టీ నాయకత్వం స్పష్టం చేసింది. ఈ పరిణామాలతో తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కినట్లు కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Astrology: జూన్ 13 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
-
CM Revanth Reddy Flight Diverted: హైదరాబాద్లో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి విమానం బెంగళూరుకు డైవర్ట్
-
Family Suicide: ఇంత ఘోరమా? ముక్కుపచ్చలారని పసిబిడ్డల పట్ల విలన్గా మారిన తండ్రి
-
TCS Engineer Suicide: TCSలో సీనియర్ల వేధింపులు.. ఉద్యోగి ఆత్మహత్య..
-
Fenya: ‘అమమ్మ’ అంటే డబ్బు, ‘చెత్త’ అంటే పోలీసులు..! దొంగలకు ఆయుధంగా మారిన రహస్య భాష..
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!