NTV Telugu Site icon

KCR Resignation: గవర్నర్‌కు రాజీనామా లేఖ పంపిన కేసీఆర్‌

Kcr

Kcr

KCR Resignation: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు దాదాపు ముగిసింది. తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్‌కు అవసరమైన మేజిక్ ఫిగర్‌ను అలవోకగా అందుకుంది. కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. మరోవైపు వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలన్న బీఆర్‌ఎస్‌ ఆశలు ఆవిరైపోయాయి. మంత్రులు కూడా బీఆర్‌ఎస్‌ ఓటమిని అంగీకరించారు. మరోవైపు ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్‌ రాజీనామా చేశారు. దీనికి సంబంధించి తన రాజీనామా లేఖను తన ఓఎస్డీతో లేఖను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు పంపినట్లు సమాచారం. ఆ తర్వాత తన సొంత వాహనంలోఫామ్ హౌజ్‌కు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

Read Also: Telangana Election Results: అధికారం ఉన్నా లేకున్నా.. తెలంగాణ ప్రజల సేవకులమే: కవిత

 

Show comments