KCR: రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో పాల్గొనాలని ప్రభుత్వం మాజీ సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేసీఆర్ 22 పేజీల బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో బీఆర్ఎస్ పాల్గొనదని ఆ లేఖలో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వేడుకలకు హాజరుకాబోమని కేసీఆర్ తేల్చి చెప్పారు. తెలంగాణ అస్తిత్వాన్ని కాంగ్రెస్ అవమానిస్తోందని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పోకడలు వీడి రాష్ట్ర అభివృద్ధికి పని చేయాలన్నారు.
Read Also: Kunamneni Sambasiva Rao: తెలంగాణ ధనిక రాష్ట్రమా.. పేద రాష్ట్రమా?.. అర్థం కావడం లేదు..
ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆవిర్భావ వేడుకల్లో కేసీఆర్ పాల్గొనడం సమంజసం కాదని ఉద్యమకారులు అభిప్రాయ పడుతున్నారన్నారు. మీ నిరంకుశ పాలనకు నిరసనగా ప్రభుత్వం నిర్వహించే వేడుకల్లో బీఅర్ఎస్ పాల్గొనడం లేదన్నారు. రాష్ట్ర అవతరణ కాంగ్రెస్ దయా భిక్షగా ప్రచారం చేస్తున్న మీ భావ దారిద్య్రాన్ని నిరసిస్తున్నామన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్ రక్తశిక్తం చేసిన విషయాన్ని మీరు దాచేస్తే ధాగేది కాదన్నారు. సిటీ కాలేజ్ విద్యార్థులపై కాల్పులు జరిపి నలుగురు విద్యార్థుల ప్రాణాలు బలిగొన్న చరిత్ర కాంగ్రెస్‌ది అంటూ మండిపడ్డారు. తెలంగాణ ప్రజల అభీష్టానికి విరుద్ధంగా ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటు చేసిన దుర్మార్గ చరిత్ర కాంగ్రెస్‌ది అని తీవ్రంగా వ్యాఖ్యానించారు. అమరుల స్థూపాన్ని ఆవిష్కరిచకుండా అడ్డుపడిన కర్కషత్వం కాంగ్రెస్‌దని.. ముఖ్యమంత్రిగా మీరు జై తెలంగాణ అనే నినాదాన్ని పలకలేదన్నారు. ముఖ్యమంత్రి అయ్యి ఆరు నెలలు అవుతున్నా అమరవీరుల స్థూపాన్ని సందర్శించలేదని కేసీఆర్ మండిపడ్డారు.
