Site icon NTV Telugu

KCR Health Update: మరో ఐదు రోజుల పాటు ఆస్పత్రిలోనే కేసీఆర్

Kcr

Kcr

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ గురువారం రోజు బాత్ రూమ్ లో కాలుజారి పడటంతో ఆయనకు ఎడమకాలు తుంటికి గాయమైంది. దీంతో కేసీఆర్ ను హుటాహుటిన ఎర్రవెళ్లి ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్ లోని యశోద ఆస్పత్రికి తరలించారు. దీంతో కేసీఆర్ కు ప్రాథమిక చికిత్స అందించిన డాక్టర్లు నిన్న (శుక్రవారం) హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ చేశారు. ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉంది అని యశోద ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు.

Read Also: Telangana Assembly Sessions Live: తెలంగాణ అసెంబ్లీ లైవ్ అప్‌డేట్స్..

నిన్న సాయంత్రం కేసీఆర్ కు నాలుగు గంటలకు పైగా హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేసిన యశోద ఆస్పత్రి వైద్యులు.. మేజర్ సర్జరీ కావడంతో మరింత పర్యవేక్షణ అవసరం అవుతుంది అని డాక్టర్లు తెలిపారు. ఐవీ ఫ్లూయిడ్స్, యాంటీ బయోటిక్స్, పెయిన్ కిల్లర్స్ తో మెడికేషన్ కొనసాగుతోంది.. వైద్యుల పర్యవేక్షణలో సాధారణ డైట్ ఫాలో అవుతున్నారు అని పేర్కొన్నారు. ఆయన కొంత కోలుకున్న తర్వాత నడిపించే ప్రయత్నం చేస్తారు.. ఫిజియథెరపీ కూడా నిర్వహిస్తారు.. ఇంకా 5 రోజుల వరకు ఆస్పత్రి లోనే వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సి వస్తోంది.. రికవరీకి సాధారణంగా ఆరు నుండి ఎనిమిది వారాల వరకు సమయం పడుతుంది.. సీనియర్ సిటిజన్ కావడంతో సాధారణ స్థితిలోకి వచ్చి నడిచేందుకు కనీసం మూడు నెలల సమయం పడుతుంది అని యశోద ఆస్పత్రి వైద్యులు తెలిపారు.

Exit mobile version