Site icon NTV Telugu

KCR Health Update: నేడు మరోసారి యశోదా హాస్పిటల్‌కు వెళ్లనున్న మాజీ సీఎం..!

Kcr

Kcr

KCR Health Update: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ఈరోజు జనరల్ హెల్త్ చెకప్ కోసం హైదరాబాద్‌ లోని సోమాజిగూడ యశోదా హాస్పిటల్‌ కు వెళ్లనున్నారు. గత వారం ఆయన ఆరోగ్య పరిస్థితి దెబ్బతిని, కొద్దిగా నీరసంగా ఉండటంతో వైద్యులను సంప్రదించిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో తదుపరి పరీక్షల అనంతరం కేసీఆర్‌ కు షుగర్ లెవెల్స్ అధికంగా ఉండడం, సోడియం స్థాయిలు తగ్గిపోవడం వైద్యులు గుర్తించారు.

Read Also:Samsung Galaxy S24 5G: ఆలోచించిన ఆశాభంగం.. ఆ ప్రీమియం ఫోన్ పై ఏకంగా రూ.37,000కి పైగా తగ్గింపు!

దీంతో వైద్యుల సూచన మేరకు ఆయన రెండు రోజుల పాటు సోమాజిగూడ యశోదా హాస్పిటల్‌లోనే ఉన్నారు. వైద్య పర్యవేక్షణలో ఆయన ఆరోగ్యం మెరుగవుతోంది. దీనితో ఈరోజు మరోసారి పూర్తి స్థాయిలో జనరల్ హెల్త్ చెకప్ చేయించుకోనున్నారు. వైద్య బృందం తాజా నివేదిక ఆధారంగా తదుపరి వైద్య సూచనలు ఇవ్వనుంది. కేసీఆర్ ఆరోగ్యంపై ఆయన అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

Read Also:Teachers Make Drugs: ఈ సైన్స్ టీచర్ల రూటే వేరు.. స్కూల్ కు ఎగ్గొట్టి.. డ్రగ్స్‌ తయారు చేస్తున్న వైనం

Exit mobile version