NTV Telugu Site icon

KCR : 110 రోజుల్లోనే ఇంత దుర్భరమైన పరిస్థితి చూస్తామనుకోలేదు

Kcr

Kcr

రైతులకు పంట నష్టపరిహారం అందే వరకు బీఆర్‌ఎస్‌ విశ్రమించేది లేదనిమాజీ సీఎం కే చంద్రశేఖరరావు రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని టార్గెట్‌గా చేసుకున్నారు . కేవలం 100 రోజుల పరిపాలనలో 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మేం రైతులకు అన్ని ఏర్పాట్లు చేసి పెట్టినా ఈ దుస్థితి ఎందుకొచ్చింది? దేశంలోనే ఉత్పత్తిలో నంబర్‌ వన్‌ స్థాయికి ఎదిగిన రాష్ట్రం అనతికాలంలో ఈ స్థాయికి ఎందుకు దిగజారిందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఆత్మహత్యలు చేసుకోవద్దని రైతులకు తన సందేశంలో పేర్కొన్నారు. 110 రోజుల్లోనే ఇంత దుర్భరమైన పరిస్థితి చూస్తామనుకోలేదని ఆయన అన్నారు. BRS మీ పక్షాన పోరాడుతుంది. ప్రధాన ప్రతిపక్షంగా ఇది మా బాధ్యత. అయితే, బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పార్టీగా పని చేసేందుకు కొత్త ప్రభుత్వానికి సమయం ఇవ్వాలని బీఆర్‌ఎస్ కోరుతున్నట్లు తెలిపారు. కానీ రాష్ట్రంలోని విపత్కర పరిస్థితులు ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపవలసి వచ్చింది.

Atchannaidu Mother: ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి మాతృవియోగం

పరిస్థితిపై సమీక్షా సమావేశాలు నిర్వహించడంలో రాష్ట్ర ప్రభుత్వం, మంత్రులు విఫలమయ్యారని, దీంతో రాష్ట్రంలో గందరగోళ పరిస్థితి నెలకొందన్నారు. మిషన్‌ భగీరథ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఇంటికో నల్లా పెట్టి నీళ్లు ఇచ్చిన రాష్ట్రంలో తాగునీటికి కరువు ఎందుకొచ్చినట్టు..? మా టైమ్‌లో బ్రహ్మాండంగా తాగునీటి సరఫరా జరిగింది. ఎక్కడా నీళ్ల ట్యాంకర్లు కనపడలే. ఏ ఆడ బిడ్డ కూడా వీధుల్లో బింద పట్టుకుని కనపడలే. కానీ, ఇప్పుడు హైదరాబాద్‌ నగరంలో కూడా ట్యాంకర్లతో నీళ్లు సరఫరా చేసే దుస్థితి ఎందుకొచ్చింది?’ అని కేసీఆర్‌ నిలదీశారు. తాము హైదరాబాద్‌ను పవర్ ఐలాండ్ సిటీగా మార్చామన్నారు. రాత్రింబవళ్లు కొట్లాడి నేషనల్ పవర్ గ్రిడ్ కు అనుసంధానం చేయించామన్నారు. 24 గంటలపాటు కరెంట్ ఇచ్చామని చెప్పుకొచ్చారు.

Babar Azam: మళ్లీ అతని చేతికే జట్టు పగ్గాలు..