అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి కేసీఆర్ భరోసా ఇచ్చారు. కిష్టయ్య కూతురు వైద్య విద్య కోసం ఆర్థిక సాయం అందజేశారు. ఇచ్చిన మాట ప్రకారం.. తెలంగాణ ఉద్యమ అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి తన సహాయాన్ని కొనసాగిస్తూనే ఉన్నట్లు కేసీఆర్ పత్రికా ప్రకటనలో తెలిపారు. ఆదివారం ఎర్రవెల్లి నివాసంలో అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబ సభ్యులు కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటంలో తన ప్రాణాలను బలిదానం చేసిన కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబాన్ని అన్నీ తానై కేసీఆర్ ఆదుకుంటున్నట్లు గుర్తు చేశారు. కిష్టయ్య కుమార్తె ప్రియాంక చదువుకు కేసీఆర్ ఆర్థిక సాయం
అందిస్తున్నారని చెప్పారు.
READ MORE: Fire Accident: ఒకే కుటుంబానికి చెందిన 10 మంది మృతి.. సీఐపై బంధువుల దాడి..
వైద్యవిద్య లో ఆసక్తికనబరిచిన ప్రియాంకను ఇప్పటికే కేసీఆర్ ఎంబీబిఎస్ చదివించారని ప్రకటనలో పేర్కొన్నారు.. ఎంబిబిఎస్ పూర్తి చేసుకుని ప్రస్తుతం డా. ప్రియాంక పీజీ చేస్తున్నారు. ఆమె చదువుకు కావలసిన ఆర్థిక సాయాన్ని నేడు కేసీఆర్ కిష్టయ్య భార్యా పిల్లలకు అందించారు. కాగా… కిష్టయ్య కుమారుడు రాహుల్ వివాహం నిశ్చయమైన విషయాన్ని ఈ సందర్భంగా తెలుసుకున్న ఆయన సంతోషం వ్యక్తం చేశారు. తన సంపూర్ణ సహకారం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుందని భరోసా ఇచ్చారు.
READ MORE: YS Jagan: తిరుపతిలో దళిత విద్యార్థిపై దాడి.. అధికార పార్టీ డైరెక్షన్‌లో కక్షసాధింపు చర్యలు