NTV Telugu Site icon

BRS Chief: 24 గంటల కరెంట్, రైతుబంధు, అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ గెలవాలి

Brs

Brs

వరంగల్ జిల్లాలోని వర్థన్నపేట నియోజకవర్గం భట్టుపల్లిలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. సీఎం వెంట మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, మాజీ స్పీకర్ మధుసూదనాచారి ఉన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 24 గంటల కరెంటు, రైతుబంధు, అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ గెలవాలన్నారు. కాంగ్రెస్ నాయకులు అహంకారంగా మాట్లాడుతున్నారు.. గుడుంబా ప్యాకేట్ ఇస్తే ఓటు వేస్తారని అంటున్నారు.. అవమానకరంగా అవహేళన చేస్తున్నారు అని కేసీఆర్ తెలిపారు.

Read Also: Thangalaan: విక్రమ్.. అదును చూసి దింపుతున్నాడే

అందరికీ న్యాయం చేసే విధంగా సంక్షేమ పథకాలతో ముందుకు కదిలాం అని సీఎం కేసీఆర్ అన్నారు. ఇప్పుడు చాలా మంది వచ్చి అవాక్కులు చెవాక్కులు చెబుతారు.. వారికి ఓట్లు తప్ప ప్రజా సంక్షేమం పట్టదు.. కొంత మంది దుర్మార్గులు షార్ట్ కట్ లో రింగ్ రోడ్ ల్యాండ్ పూలింగ్ అని అబద్దాలు చెబుతారు.. రింగ్ రోడ్ ల్యాండ్ పూలింగ్ లేదు.. కాంగ్రెస్ నేతలు రైతు బంధు వద్దంటున్నారు.. వద్దంటున్న వారికి బుద్ది చెప్పాలి అని ఆయన కోరారు. మరో నాయకుడు అంటున్నాడు 24 గంటల కరెంటు అవసరం లేదంటున్నారు.. అవసరమా వద్దా చెప్పండి.. రైతుబంధును పుట్టించిందే కేసిఆర్..
వచ్చే మార్చి తర్వాత 12 వేలు చేసుకుంటాం.. వచ్చే ఐదేళ్లలో 16 వేలకు పెంచుతామని కేసీఆర్ చెప్పుకొచ్చారు.

Read Also: Parliament Panel: వ్యభిచారం, స్వలింగ సంపర్కాన్ని మళ్లీ నేరంగా పరిగణించాలని పార్లమెంటరీ ప్యానెల్ సిఫారసు..?

అబద్దాలు విని మోస పోవద్దు.. ఆగమాగం కావద్దు అని గులాబీ బాస్ కేసీఆర్ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ రాజ్యంలో ఎట్లా ఉండే.. మందు బస్తాలు దొరకలేదు.. కల్తీ విత్తనాలు ఉండే.. ధరణి తీసేస్తే రైతుబంధు రాదు.. రైతుబంధు సహాయం ప్రపంచంలో ఎక్కడ లేదు.. సంక్షేమ రాజ్యంగా ముందుకు పోతున్నాం.. గ్రేటర్ వరంగల్ లో విలీనమైన 40 గ్రామాలకు ప్రత్యేకంగా ఫండ్స్ ఇస్తానంటూ కేసీఆర్ వెల్లడించారు.