Site icon NTV Telugu

KC Venugopal: భయంకర విషాదాన్ని తృటిలో తప్పించుకున్నాం.. అదృష్టమే కాపాడింది!

Kc Venugopal Air India

Kc Venugopal Air India

KC Venugopal post about India Flight Emergency Landing: మరో ఎయిర్‌ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఆదివారం రాత్రి తిరువనంతపురం నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం (AI2455)లో టెక్నికల్‌ ఇష్యూలు వచ్చాయి. గుర్తించిన పైలట్‌ చెన్నైలో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేశారు. వివరాల ప్రకారం.. విమానం రెండు గంటలకు పైగా గాలిలో ఉండి.. చివరకు చెన్నై విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. విమానం రాత్రి 8 గంటలకు తిరువనంతపురం నుంచి బయలుదేరి.. రాత్రి 10.35 గంటలకు చెన్నైలో ల్యాండ్ అయిందని సమాచారం.

ఎయిర్ ఇండియా విమానంలో ఐదుగురు ఎంపీలు ఉన్నారు. ఎంపీలు కేసీ వేణుగోపాల్, కోడిక్కున్నిల్ సురేష్, అదూర్ ప్రకాష్, కే రాధాకృష్ణన్, రాబర్ట్ బ్రూస్‌లు తిరువనంతపురం నుంచి ఢిల్లీకి వెళ్తున్నారు. ఈ సంఘటనపై కాంగ్రెస్ అగ్రనేత కేసీ వేణుగోపాల్ సోషల్ మీడియాలో స్పందించారు. పైలట్‌ తక్షణ నిర్ణయం ప్రయాణికుల ప్రాణాలను కాపాడిందన్నారు. ‘భయంకర విషాదాన్ని మేము తృటిలో తప్పించుకున్నాం. నైపుణ్యం, అదృష్టం రెండూ మమ్నల్సి కాపాడాయి. క్లియరెన్స్ కోసం దాదాపు రెండు గంటల పాటు వేచి ఉండాల్సి వచ్చింది. మొదటి ల్యాండింగ్ ప్రయత్నంలో రన్‌వేపై మరొక విమానం ఉంది. రెండవ ప్రయత్నంలో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ప్రయాణీకులకు ఎప్పటికీ అదృష్టం కలిసిరాదు. ఈ సంఘటనపై వెంటనే దర్యాప్తు చేయాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖను కోరుకుతున్నా’ అని కేసీ వేణుగోపాల్ ఎక్స్‌లో పేర్కొన్నారు.

Also Read: Telangana Rains: నేడు, రేపు భారీ వర్షాలు.. 13 నుంచి అతి భారీ వానలు!

చెన్నై విమానాశ్రయంలోని రన్‌వేపై మరొక విమానం ఉందన్న ఎంపీ కేసీ వేణుగోపాల్ వాదనను ఎయిర్ ఇండియా తోసిపుచ్చింది. సాంకేతిక సమస్య, వాతావరణ పరిస్థితుల కారణంగా చెన్నై వైపు విమానాన్ని మళ్లించాలని మేము నిర్ణయించుకున్నాం అని పేర్కొంది. ఇది ముందు జాగ్రత్త చర్య అని స్పష్టం చేయాలనుకుంటున్నామని తెలిపింది. చెన్నై విమానాశ్రయంలో మొదటి ల్యాండింగ్ ప్రయత్నంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ “గో-అరౌండ్” ఆదేశించిందని, రన్‌వేపై మరే ఇతర విమానం ఉండటం వల్ల కాదని ఎయిర్ ఇండియా అంటోంది.

Exit mobile version