Kavya-Anirudh Reception: ముఖంపై సింధూరం లేదు, చేతులకు మెహందీ అసలే లేదు.. అయినా సరే, తన రాయల్ రిసెప్షన్ పార్టీలో ఎరుపు రంగు డ్రెస్సులో కొత్త పెళ్లికూతురు కావ్య మారన్ (Kavya Maran) మెరిసిపోయింది. ఇక, తన డ్యాషింగ్ లుక్‌తో మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) వేడుకకే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు. ఇక, అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ ప్రస్తుతం తమ జీవితంలో అత్యంత సంతోషకరమైన ఫేజ్‌లో ఉన్నారు. గ్రీస్‌లో (Greece) డ్రీమ్ వెడ్డింగ్‌తో ఒక్కటైన ఈ జంట, నవంబర్ 21న చెన్నైలో (Chennai) అత్యంత వైభవంగా గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించారు. ఈ రాయల్ పార్టీకి సినీ ఇండస్ట్రీ ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ దిగ్గజాలు కూడా హాజరయ్యారు. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఇన్‌సైడ్ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
రిసెప్షన్ వేదికపైకి కొత్త దంపతులు చేతిలో చేయి వేసుకుని ఎంట్రీ ఇచ్చిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ పార్టీలో అనిరుధ్, కావ్యల రిసెప్షన్ లుక్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కొత్త పెళ్లికూతురు కావ్య తన రిసెప్షన్ కోసం రెడ్ కలర్ ఇండో-వెస్ట్రన్ అవుట్‌ఫిట్‌ను (Indo-Western Outfit) ఎంచుకున్నారు. హై-నెక్, ఫుల్ స్లీవ్స్ ఉన్న రెడ్ టాప్‌కు జతగా మ్యాచింగ్ ఫ్లోర్-లెంగ్త్ స్ట్రెయిట్ స్కర్ట్‌ను (Floor-Length Straight Skirt) ధరించారు. ఆ డ్రెస్సుపై ఉన్న ఎరుపు రంగు ఎంబ్రాయిడరీ (Embroidery), బీడ్స్ వర్క్ (Beads Work) ఆమె అందాన్ని రెట్టింపు చేశాయి.
ఈ మోనోక్రోమాటిక్ రెడ్ సిల్హౌట్ డ్రెస్సుపై కావ్య హెవీ జ్యువెలరీ (Heavy Jewellery) జోలికి వెళ్లకుండా చాలా సింపుల్‌గా, క్లాసీగా కనిపించారు. కేవలం స్టేట్‌మెంట్ ఇయర్ రింగ్స్ (Statement Earrings) మాత్రమే ధరించి తన లుక్‌ను కంప్లీట్ చేశారు. మేకప్ విషయంలోనూ సటిల్, గ్లోయింగ్ మేకప్‌ను (Glowing Makeup) ఎంచుకున్న కావ్య, న్యూడ్ లిప్‌స్టిక్ (Nude Lipstick), మిడిల్ పార్టెడ్ కర్లీ హెయిర్ స్టైల్‌తో ఎంతో గార్జియస్‌గా కనిపించారు. అయితే, సంప్రదాయబద్ధంగా ఉండే సింధూరం గానీ, చేతులకు మెహందీ గానీ లేకపోయినా.. ఈ వెస్ట్రన్ బ్రైడల్ లుక్‌లో కావ్య తన స్టైల్‌తో అందరి చూపునూ తనవైపు తిప్పుకున్నారు. మరోవైపు పెళ్లికొడుకు అనిరుధ్ కూడా తన స్టైలిష్ లుక్‌తో అదరగొట్టారు. బ్లాక్ అండ్ బర్గండీ కలర్ బంద్‌గలా (Bandhgala), బ్లాక్ ట్రౌజర్‌తో ఎంతో హ్యాండ్సమ్‌గా కనిపించారు. ఈ కొత్త జంట రిసెప్షన్ లుక్స్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

