NTV Telugu Site icon

Mlc Kavitha: కేసీఆర్‌తో కవిత భేటీ.. ఈడీ విచారణపై చర్చ

Kcr And Kavitha

Kcr And Kavitha

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో ఈడీ విచారణకు హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో కవితతో పాటు మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్ తో కలిసి శనివారం అర్థరాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నారు. అనంతరం నేరుగా ప్రగతిభవన్‌కు కవిత వెళ్లి.. సీఎం కేసీఆర్ ను కలిశారు. ఈడీ విచారణపై చర్చించారు. ఈడీ అధికారులు ఏయే ప్రశ్నలు అడిగారు? అనే వివరాలను కేసీఆర్‌కు కవిత చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నెల 16న మరోసారి విచారణకు ఉన్న నేపథ్యంలో ఆ విషయంపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది.
Also Read:Yuvagalam: లోకేష్ పాదయాత్రకు బ్రేక్

కాగా, లిక్కర్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితను ఢిల్లీలోని ఈడీ ఆఫీస్‌లో అధికారులు విచారించారు. కవితపై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. దాదాపు 9 గంటల పాటు కవితను వివిధ ప్రశ్నలతో విచారించారు. తొలిసారి ఈడీ విచారణలో ప్రాథమిక అంశాల గురించే ఈడీ ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. లిక్కర్ స్కాంలో కవిత పాత్ర ఏంటి? నిందితులతో ఆమె ఉన్న పరిచయాలు ఏంటి? నగదు లావాదేవీల్లో మీ హస్తం ఉంటి? అనే ప్రశ్నల గురించి ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఈ నెల 16న జరిగే విచారణలో కవితను మరింత లోతుగా ఈడీ విచారించనుందని తెలుస్తోంది.

Show comments