NTV Telugu Site icon

Kasu vs Yarapathineni: నేను ఓడిపోతే రాజకీయ సన్యాసమే..! కానీ, నిన్ను ఓడించి రిటైర్మెంట్ ఇప్పిస్తా..

Kasu

Kasu

Kasu vs Yarapathineni: ఎన్నికల వేళ పల్నాడు జిల్లాలో సవాళ్ల పర్వం కొనసాగుతుంది.. యరపతినేని సవాలుపై స్పందించిన కాసు మహేష్ రెడ్డి.. గట్టిగా కౌంటర్‌ ఇచ్చారు. గురజాల నియోజకవర్గం పిడుగురాళ్లలో మాట్లాడుతూ.. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున నేను ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటాను.. 2024 ఎలక్షన్స్ లో కాసు మహేష్ రెడ్డి నువ్వు ఓడిపోతే రాజకీయాలనుంచి తప్పుకుంటావా? అన్న యరపతినేని శ్రీనివాసరావు వ్యాఖ్యలపై స్పందించిన కాసు.. నువ్వు విసిరిన సవాల్ స్వీకరించడానికి గంట టైం ఎందుకు దండగ.. 10 నిమిషాలు చాలు అన్నారు.

Read Also: Delhi: బీజేపీలో చేరిన గుజరాత్ కాంగ్రెస్ మాజీ నేత రోహన్ గుప్తా

ఇక, 2019 ఎన్నికల్లో నిన్ను చిత్తుచిత్తుగా ఓడించి ఇంటికి పంపాను గుర్తులేదా ? అని ప్రశ్నించారు కాసు మహేష్‌ రెడ్డి.. ఇదే 2024 ఎలక్షన్స్ లోనూ నిన్ను ఓడించి రాజకీయాల నుంచి రిటైర్మెంట్ ఇప్పిస్తా.. గుంటూరులో కూర్చోబెట్టకపోతే నా పేరు కాసు మహేష్ రెడ్డి కాదు అన్నారు.. 2024లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున కాసు మహేష్ రెడ్డి అనే నేను ఓడిపోతే నువ్వు అన్నట్టుగానే రాజకీయ సన్యాసం తీసుకుంటానని బదులిచ్చారు గురజాల నియోజకవర్గం శాసనసభ సభ్యుడు, వైసీపీ అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి. కాగా, ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మరోవైసు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి నేతల మధ్య విమర్శలు, ఆరోపణల పర్వం తారాస్థాయికి చేరుకున్న విషయం విదితమే.