Kasam Venkateswarlu: హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ జనరల్ సెక్రటరీ కాసం వెంకటేశ్వర్లు మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు కలిసి బీజేపీపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని, బనకచర్ల ప్రాజెక్ట్ అంశంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ లు విఫలం అయ్యాయని అయ్యన అన్నారు. బనకచర్లపై సరైన సమయంలో కావాల్సిన నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. బనకచర్లపై CWC అనుమతి తప్పనిసరి ఉంటుంది. అలాగే బనకచర్ల అంశంలో అనుమతులు నిలిపివేశామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.. అయినా ఇష్టం వచ్చినట్టు నోటి దూల నిరూపించుకుంటున్నారని ఆయన ఆగ్రహించారు.
Read Also:High Court: “I Love You చెప్పడంలో లైంగిక ఉద్దేశం లేదు”.. హైకోర్టు సంచలన తీర్పు..
బనకచర్లపై శాస్త్రీయ పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల పరిశీలన చేస్తుందని, కృష్ణ వాటర్ ను పూర్తి స్థాయిలో వినియోగించుకోవడoపై బీఆర్ఎస్, కాంగ్రెస్ స్పష్టత లేదన్నారు. కృష్ణ వాటర్ వినియోగంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. దశ, దిశ లేకుండా రేవంత్ సర్కార్ ముందుకు వెళ్తోందని.. జూరాల ప్రాజెక్ట్ గేట్లు తుక్కు పడితే, రిపేర్ చేయలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేసారు. రాష్ట్రంలో ప్రాజెక్ట్ లన్ని పెండింగ్ ఉన్నాయి. ఒక్క ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయకుండా కేంద్ర ప్రభుత్వంపై అడ్డగోలుగా మాట్లాడటం అవివేకానికి నిదర్శనమని అయన అన్నారు.
Read Also:Sigachi Factory Blast: సిగాచి ఫ్యాక్టరీ అగ్నిప్రమాదం.. దర్యాప్తుకు నిపుణుల కమిటీ ఏర్పాటు
కేసీఆర్, రేవంత్ రెడ్డిలు కలిసి తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు. బనకచర్లపై బీజేపీ ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరికి అనుకూలం కాదు. నదులకు నడకలు నేర్పిన వారు కాళేశ్వరం కొట్టుకు పోయారని అన్నారు. ఏ ప్రాజెక్ట్ ఏ బేసిన్ లో ఉందో తెలియని వారు ముఖ్యమంత్రి అవుతారు.. అంతకన్నా దురదృష్టకరం ఏముందని అన్నారు. ఒక్క కంపీనైనా రాష్ట్రానికి తీసుకొచ్చారా..? రేవంత్ రెడ్డి దమ్ముంటే చెప్పాలి. కేంద్ర పార్టీకి కప్పం కడుతూ కాంగ్రెస్ నేతలు పబ్బం గడుపుకుంటున్నారని, బీజేపీ కప్పం కట్టే పార్టీ కాదని ఆయన పేర్కొన్నారు. ఇష్టానుసారంగా నోరు పారేసుకుంటే తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారు. రేవంత్ సర్కారుకు ఓట్లెందుకు వేశామని ప్రజలు అసహించుకుంటున్నారని.. ఇప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్ కు పరిమితమయ్యారు, రేపు రేవంత్ రెడ్డికి అదే గతి పడుతుందని ఆయన అన్నారు.
