రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించాలని టీడీపీ కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నాయని పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు చంద్రబాబు గురించి ఆలోచించడం లేదని ఆయన అన్నారు. చంద్రబాబు ప్రజల దగ్గరకు యాక్టర్లను పంపిస్తుంటే.. జగన్ డాక్టర్లను పంపిస్తున్నారని, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు చెప్పుకోవటానికి ఒక్క పథకం కూడా లేదని మంత్రి కారుమూరి మండిపడ్డారు. చంద్రబాబు ఇన్నేళ్ళు స్టేల మీదే బతికాడని, శిశుపాలుడిలా చంద్రబాబు పాపం పండిందన్నారు మంత్రి కారుమూరి. అంతేకాకుండా.. చంద్రబాబు, కాంగ్రెస్ కలిసి జగన్ పై తప్పుడు కేసులు పెట్టారని, చంద్రబాబు సామాజిక వర్గం వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకున్నారన్నారు. గతంలో చంద్రబాబు మనకు ఏం ప్రయోజనం చేశాడు అని చర్చించుకున్నారని, ఈ నాలుగేళ్ళల్లో జగన్ మన సామాజిక వర్గానికి చేసిన నష్టం ఏంటి అన్న చర్చ జరిగిందన్నారు.
Also Read : NBK 109 :సరికొత్త పాత్రలో కనిపించబోతున్న బాలయ్య..
కులంతో సంబంధం సంక్షేమ పథకాలు అందుతున్నాయి అన్న అభిప్రాయం వ్యక్తం అయ్యిందని మంత్రి కారుమూరి తెలిపారు. అయితే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రి కారుమూరి సెటైర్లు వేశారు. పవన్ కళ్యాణ్ యాక్టర్.. స్క్రిప్ట్ ఇస్తే చదివేస్తాడన్నారు. లోకేష్ అవినీతిపరుడు, టీడీపీ వాళ్ళు దుర్మార్గంగా దోపిడీ చేస్తున్నారని మాట్లాడిన పవన్ ఇప్పుడు ప్లేట్ ఫిరాయించేశాడని, తోలు తీస్తా, బట్టలూడదీస్తా లాంటి డైలాగులు… సినిమాల్లో బాగుంటాయని, బయట పనికి రావన్నారు మంత్రి కారుమూరి. జనసేన కు అజెండా ఉందా? పార్టీ నిర్మాణం ఉందా?? అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కనిపించటం లేదా?? అని ఆయన అన్నారు. పవన్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి. భయం అంటే తెలియని వ్యక్తి జగన్. సోనియా గాంధీనే ఢీ కొన్నాడు. పవన్ ప్యాకేజీ స్టార్ అని ప్రజలు అందరికీ తెలుసు. ఢిల్లీలో లోకేష్ కు ఎవరూ తలుపులు తెరవ లేదు. చంద్రబాబు మోడీ పై వ్యక్తిగతంగా విమర్శలు చేశాడు. రెండు ఎకరాల నుంచి వేల కోట్ల ఆస్తులు సంపాదించిన అవినీతిపరుడు చంద్రబాబు. ఇటువంటి వ్యక్తని ఎవరూ దగ్గరకు రానివ్వరు. అని మంత్రి కారుమూరి వ్యాఖ్యానించారు.
Also Read : ODI World Cup 2023: ఆస్ట్రేలియాతో మ్యాచ్.. భారత్‌కు భారీ షాక్! ఓపెనర్‌గా ఇషాన్
