Site icon NTV Telugu

Karthi Sardar Movie: సర్దార్ సినిమా ఇలా ఉంటుందనుకోలేదు.. ట్విట్టర్ టాక్

Sardar

Sardar

Karthi Sardar Movie: సినిమా సినిమాకు వేరియషన్స్ చూపిస్తూ అభిమానులను పెంచుకుంటున్న హీరో కార్తీ. తీసిన ప్రతీ సినిమాలోనూ కొత్త దనం ఉండేలా కథలను ఎంచుకుంటూ తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్నారు ఈ టాలెంటెడ్ హీరో. అందువల్లే ఆయన సినిమా వస్తుందంటే అందులో ఏదో కొత్త దనం ఉంటుందని ప్రేక్షకులు థియేటర్లకు వస్తుంటారు. హీరో కార్తీకి తమిళ్ లోనే కాదు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. ఆయన సినిమాలు తెలుగులోనూ మంచి విజయాలు సాధించిన విషయం తెలిసిందే. ఇటీవలే పొన్నియన్ సెల్వన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. నేడు జిన్నా, ఓరి దేవుడా, ప్రిన్స్‌ చిత్రాలతో పాటు కార్తీ హీరోగా నటించిన ‘సర్దార్’ కూడా బాక్సాఫీస్ పోటీలో నిలిచింది.

Read Also: Ori Devuda: క్లాసీ ఎలిమెంట్స్‎తో విశ్వక్ సేన్ కామెడీ.. ‘ఓరి దేవుడా’ ట్విట్టర్ రివ్యూ

ఇండియన్ స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో హీరో కార్తి విలక్షణ పాత్రలో నటించారు. అభిమన్యుడు ఫేమ్ దర్శకుడు పిఎస్ మిత్రన్ తెరకెక్కిస్తున్న సినిమా సర్దార్ ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మించారు. రాశి ఖన్నా , రజిషా విజయన్ కథానాయికలుగా నటించారు.

కింగ్ అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమాని తెలుగు రాష్ట్రాలలో భారీగా విడుదల చేస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే యుఎస్‌తో పాటు తమిళ నాడులో పలు థియేటర్స్‌లో ప్రీమియర్ షోలు పడటంతో ఫ్యాన్స్ ఈ సినిమా పై తమ అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తున్నారు. సర్దార్ ఫస్టాఫ్ చాలా ఇంట్రస్టింగ్‌గా ఉందని.. సినిమా ఇంత సూపర్ గా ఉంది అని అంటున్నారు నెటిజన్స్. యాక్షన్స్ సీన్స్, ట్విస్ట్ లు ఈ సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లాయని.. అలాగే కార్తి నటన ఈ సినిమాకు మెయిన్ హైలైట్ అని అంటున్నారు.

Read Also: Ginna Twitter Review: మంచు విష్ణు ‘జిన్నా’ మూవీ.. ట్విట్టర్ రివ్యూ

Exit mobile version