NTV Telugu Site icon

Cricket Stadium: దక్షిణ భారత్లో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం

Karnataka

Karnataka

దక్షిణ భారత దేశంలో మరో అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం నిర్మించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తుంది. క‌ర్ణాట‌క రాష్ట్రంలోని మైసూర్‌లో ఈ స్టేడియం ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఈ స్టేడియం నిర్మాణం కోసం మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ 20. 8 ఎకరాల స్థలాన్ని కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (కేఎస్‌సీఎ)కి అప్పగించేందుకు రెడీ అయినట్లు తెలుస్తుంది. మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (MUDA) ఆ భూమిని కేఎస్‌సీఎకు 30 సంవత్సరాల పాటు లీజుకు ఇవ్వనున్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది. అందుకు ప్రతిఫలంగా 18 కోట్ల రూపాయల లీజు మొత్తాన్ని ముడా పొందనున్నట్లు పలు రిపోర్ట్స్ పేర్కొంటున్నాయి.

Read Also: Ram Charan: రామోజీ రావు మృతి.. గేమ్ ఛేంజర్ షూట్లో రామ్ చరణ్ అశ్రు నివాళులు

కాగా, తాజాగా అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మించే ప్రాంతాన్ని కేఎస్‌సీఎ అధికారులు పరిశీలించినట్లు తెలుస్తుంది. వ‌చ్చే ఏడాది చివరి నాటికి ఈ స్టేడియం నిర్మాణం పూర్తి కాబోతుందని కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ కు చెందిన అధికార వ‌ర్గాలు వెల్లడించాయి. కాగా కర్ణాటక రాష్ట్రంలో ఇది రెండో అంత‌ర్జాతీయ స్టేడియం కాబోతుంది. ఇప్పటికే బెంగ‌ళూరులో చిన్నస్వామి అంత‌ర్జాతీయ క్రికెట్ స్టేడియం ఉంది.