Karnataka: బీహార్ ఎన్నికల తర్వాత కర్ణాటకలో పెను రాజకీయ మార్పులు వస్తాయని కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బి.వై. విజయేంద్ర అంచనా వేశారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ మధ్య అధికార పోరాటం జరుగుతుంద జోష్యం చెప్పారు. తాజాగా విజయేంద్ర విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో గందరగోళం నెలకొందన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు నాయకత్వ మార్పు గురించి బహిరంగంగా ప్రకటనలు చేస్తున్నారని గుర్తు చేశారు. సిద్ధరామయ్య తొందరపడుతున్నట్లు కనిపిస్తున్నారన్నారు.
READ MORE: Samsung Galaxy F07 Launch: ఏడు వేలకే.. 50 ఎంపీ కెమెరా, 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ శాంసంగ్ ఫోన్!
రెండు నెలల క్రితం మైసూర్‌లో ఆయన బల ప్రదర్శనను మీరు చూసి ఉంటారు. ఆయన తన శక్తిని ప్రదర్శిస్తున్నారు. అధికార కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు అక్టోబర్, నవంబర్‌లలో విప్లవం గురించి బహిరంగంగా మాట్లాడుతున్నారని బీజేపీ అధ్యక్షుడు బి.వై. విజయేంద్ర పేర్కొన్నారు. నాయకత్వ మార్పుపై చర్చించవద్దని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ తన పార్టీ నాయకులను కోరిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ అంశంపై పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు బహిరంగంగా మాట్లాడొద్దని చెబుతున్నారు.. కానీ నాయకత్వ మార్పు ఉండదని కాంగ్రెస్ నాయకత్వంలో ఎవరూ చెప్పడం లేదని విజయేంద్ర అన్నారు. దీంతో బీహార్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో అనేక రాజకీయ మార్పులు జరుగుతాయని.. రాష్ట్రంలో గందరగోళం నెలకొంటుందని స్పష్టమైందన్నారు.
READ MORE: Rohit Sharma: 2027 వన్డే ప్రపంచకప్‌లో ఆడాలనుంది.. రోహిత్ శర్మ వీడియో వైరల్!
మరోవైపు.. ముఖ్యమంత్రిగా ఐదేళ్ల పాటు తానే పాలన పూర్తి చేస్తానని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరోసారి చెప్పారు. దీంతో ఉప ముఖమంత్రి డీకే శివకుమార్ వర్గానికి చెందిన నాయకులు కంగుతిన్నారు. సీఎం వ్యాఖ్యలపై ఉప ముఖ్యమంత్రి స్పందించలేదు. శనివారం పార్టీ వ్యవహారాల బాధ్యుడు రణదీప్ సింగ్ సూర్జేవాలతో శివకుమార్ భేటీ అయ్యారు. అధికార మార్పిడికి సంబంధించి వ్యాఖ్యలు చేసిన పార్టీ నేతలు శివరామేగౌడ, రంగనాథ్‌లకు ఇప్పటికే తాఖీదులు జారీ చేశానని సింగ్ దృష్టికి తీసుకువెళ్లారు. ముఖ్యమంత్రి మార్పిడి ఉన్నా, లేకపోయినా ఆ విషయాన్ని అధిష్ఠానం మాత్రమే ప్రకటించాలని ఆయనకు సూచించారు. ప్రతిసారీ పార్టీలో నాయకులు, కార్యకర్తలను గందరగోళానికి గురి చేస్తున్న అంశాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రస్తావిస్తూ రావడం తేనెతుట్టెను కదపడమేనని శివకుమార్ అభిప్రాయపడ్డారు. తాను కూడా పార్టీ కోసం శ్రమిస్తూ వచ్చానని, పార్టీ రాష్ట్రాధ్యక్షుడిగా 135 సీట్లను గెలిపించుకు వచ్చానని సూర్జేవాల వద్ద మొరపెట్టుకున్నారు. కర్ణాటకలో ప్రభుత్వం చేసిన హామీలను అధిష్ఠానం పరిష్కరిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఇకపై ముఖ్యమంత్రి, ఆయన మద్దతుదారులు ఎటువంటి వ్యాఖ్యలు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరినట్లు సమాచారం.
