Site icon NTV Telugu

Karnataka: కర్ణాటకలో సీఎం మార్పు పుకార్లు.. ఖర్గే సంచలన వ్యాఖ్యలు..!

Kharge

Kharge

కర్ణాటక ప్రభుత్వంలో నాయకత్వ మార్పుపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై పార్టీ హైకమాండ్‌కు చర్య తీసుకునే అధికారం ఉందని స్పష్టం చేశారు. అక్టోబర్‌లో ముఖ్యమంత్రి మార్పుపై రాష్ట్రంలో ఊహాగానాలు పెరుగుతున్నాయి. ఈ అంశాన్ని తాజాగా మీడియా ప్రతినిధులు ఖర్గే దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “ముఖ్యమంత్రి మార్పు నిర్ణయం పార్టీ హైకమాండ్ చేతిలో ఉంది. హైకమాండ్‌లో ఏమి జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ఈ నిర్ణయాన్ని హైకమాండ్‌కే వదిలేయాలి. కానీ ఎవరూ అనవసరంగా సమస్యలు సృష్టించడానికి ప్రతయత్నించకూడదు.” అని ఖర్గే వ్యాఖ్యానించారు.

READ MORE: Kannappa Movie: ఊహకు మించి ‘కన్నప్ప’.. ‘మైల్ స్టోన్’ చిత్రం అవుతుంది: డిప్యూటీ సీఎం

కర్ణాటక ప్రభుత్వంలో నాయకత్వ మార్పు జరుగుతుందనే ఊహాగానాల మధ్య. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన “హైకమాండ్” వ్యాఖ్యపై బీజేపీ వ్యాంగంగా స్పందించింది. ఖర్గే కాకపోతే “పార్టీ హైకమాండ్” ఎవరు అని యంగ్ ఎంపీ తేజస్వీ సూర్య ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు చాలా వింతగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలో ఓ పోస్ట్ చేశారు. ‘‘కాంగ్రెస్‌ హైకమాండ్‌ రూపురేఖలు లేనిది. అది ఎవరికీ కనిపించదు, వినిపించదు. కానీ అది ఉన్నట్లు అందరూ అనుభూతి చెందుతారు. ఇన్నాళ్లు కాంగ్రెస్‌ అధిష్ఠానం అని ప్రజలు భావిస్తున్న పార్టీ అధ్యక్షుడు కూడా అది తాను కానని అంటున్నారు’’ అని రాసుకొచ్చారు.

READ MORE: MLA Raja Singh: టీడీపీ నుంచి బీజేపీకి.. రాజా సింగ్ రాజకీయ ప్రస్థానంపై ఓ లుక్కేయండి..

కాగా.. ఇప్పటికే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తనకు, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కు మధ్య విభేదాలు ఉన్నాయనే పుకార్లను తోసిపుచ్చారు. ” డీకే శివకుమార్, నేను కలిసే ఉన్నాం. ఈ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు శిలలాగా చెక్కుచెదరకుండా ఉంటుంది. బీజేపీ అబద్ధాలకు పేరుగాంచింది. వాళ్లు చేసే వ్యాఖ్యలపై మేము స్పందించము.” అని సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు.

Exit mobile version