NTV Telugu Site icon

Karnataka High Court: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు కర్ణాటక హైకోర్టు షాక్.. లోక్‌సభకు అనర్హులుగా ప్రకటన

Karnataka

Karnataka

Karnataka High Court: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు కర్ణాటక హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికల సర్టిఫికెట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చినందుకు గాను కోర్టు ఆయనను లోక్‌సభకు అనర్హులుగా ప్రకటించింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్‌కు తప్పుడు అఫిడవిట్‌ దాఖలు చేశారంటూ జేడీఎస్‌ ఎంపీ లోక్‌సభ సభ్యత్వాన్ని కర్ణాటక హైకోర్టు రద్దు చేసింది.

లోక్‌సభ ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం సమర్పించినందుకు హసన్‌ లోక్‌సభ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై కర్ణాటక ఉన్నత న్యాయస్థానం అనర్హత వేటు వేసింది. 2019లో న్యాయవాది, మాజీ కేడీపీ పార్టీ సభ్యుడు జి. దేవరాజేగౌడ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. నామపత్రాలు సమర్పించేటప్పుడు తన ఆస్తి వివరాలను దాచిపెట్టి ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ తప్పుడు అఫిడవిట్ సమర్పించారని ఆయన ఆరోపించారు. ఫిర్యాదులో ప్రజ్వల్ రేవణ్ణ తన అఫిడవిట్‌లో అనేక తప్పుడు సమాచారం ఇచ్చారని, ఆయన నామినేషన్‌ను రద్దు చేయాలని న్యాయవాది దువరాజ్ గౌడ కోరారు. దీనికి సంబంధించి సమాచారం సేకరించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం హసన్ జిల్లా ఎన్నికల అధికారిని ఆదేశించింది.

Also Read: Riti Saha Case: రీతి సాహ కేసులో దూకుడు పెంచిన పోలీసులు

2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రజ్వల్ రేవణ్ణ హసన్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎన్నికల సంఘానికి తప్పుడు సమాచారం అందించారని ఫిర్యాదు చేశారు. దీనిపై ఎన్నికల సంఘం కోర్టుకు నివేదిక సమర్పించి పలు విచారణలు జరిపింది. అలాగే ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై అనర్హత వేటు వేయాలని అప్పట్లో ఓడిపోయిన అభ్యర్థి ఎ. మంజు కోర్టుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికలకు ఇంకా 6 నెలల సమయం ఉండగానే ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై హైకోర్టు అనర్హత వేటు వేయడం గమనార్హం. ప్రజ్వల్ రేవణ్ణ 2019లో లోక్‌సభ ఎన్నికల కోసం తన ఆస్తి వివరాలను అఫిడవిట్‌లో సమర్పించారు. అందులో రూ. 4, 89, 15, 029 విలువైన స్థిరాస్తి, రూ. 1, 68, 86, 632 విలువైన ఆస్తులు ఉన్నాయని వివరించారు.

Show comments