కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ ఎం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై స్పందించారు. ఇండియా టుడేతో ఆయన మాట్లాడారు. జనసమూహాన్ని నిర్వహించడానికి 5000 మంది సిబ్బందిని నియమించినట్లు స్పష్టం చేశారు. కానీ మరణాల సంఖ్యను మాత్రం నిర్ధారించలేదు. “నేను ఇంకా సంఖ్యలను నిర్ధారించలేను, నేను ఇప్పుడు స్టేడియంకు వెళ్తున్నాను. చాలా మంది భావోద్వేగ అభిమానులను చేరుకున్నారు. 5000 సిబ్బందిని మోహరించాం” అని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ ఇండియా టుడేతో అన్నారు. కాగా.. ఈ ఘటనలో ఆరుగురు మరణించినట్లు తెలుస్తోంది.
READ MORE: RCB Celebrations: ఆర్సీబి విజయ-విషాదం.. ఆరుగురి మృతి.. పలువురి పరిస్థితి విషమమం..!
కాగా.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ కిరీటం కోసం ఆర్సీబీ18 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలికింది. నేడు బెంగళూరుకు చేరుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుకు అపూర్వ స్వాగతం లభించింది. ఛాంపియన్లను చూసేందుకు వేలాది మంది ఆనందోత్సాహాలతో అభిమానులు వీధుల్లోకి వచ్చారు. జూన్ 4 బుధవారం విమానాశ్రయంలో ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ విరాట్ కోహ్లీ, కెప్టెన్ రజత్ పాటిదార్ వంటి స్టార్ ఆటగాళ్లను స్వయంగా స్వాగతించారు. ఇంతలో తొక్కిసలాట జరిగినట్లు సమాచారం అందింది. ఆయన హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు.
