Telangana Assembly Elections: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు హీటు పుట్టిస్తున్నాయి.. రెండు విడతల్లో వంద మంది పేర్లు ప్రకటించిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు ప్రచారంపై ఫుల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే అగ్రనేతలు ప్రచారం నిర్వహించగా.. ఇవాళ్టి నుంచి కర్ణాటక టాప్ లీడర్లు ఎంట్రీ ఇవ్వబోతున్నారు. తమపై బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇవ్వనున్నారు. ఇవాళ డీకే శివకుమార్, రేపు మల్లీకార్జున ఖర్గే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల క్యాంపెయిన్ నిర్వహించనున్నారు.
ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ .. తాండూరులో జరిగే కార్నర్ మీటింగ్‌లో పాల్గొంటారు. తర్వాత పరిగి, చేవెళ్ల నియోజకవర్గాల్లో డీకే ప్రచారం చేస్తారు. మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు తాండూరు, సాయంత్రం 4 నుంచి 5 వరకు పరిగి, సాయంత్రం 6 నుంచి 7 వరకు చేవేళ్లలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు డీకే.. కర్ణాటకలో కాంగ్రెస్ పథకాల అమలు తీరుపై తెలంగాణలో బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలకు ఆయన కౌంటర్‌ఇచ్చే అవకాశం ఉంది.. ఎన్నికల్లో హామీ ఇచ్చి కాంగ్రెస్ అమలు చేయడం లేదనే బీఆర్ఎస్ ఆరోపణలపై డీకే ఎలా స్పందిస్తారు అనేది ఆసక్తికరంగా మారింద.ఇ.
ఇక రేపు తెలంగాణలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎన్నికల ప్రచారం చేస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో భాగంగా.. సంగారెడ్డిలో మధ్యాహ్నం 2 గంటలకు కార్నర్ మీటింగ్ ఉంటుంది. నర్సాపూర్‌లో సాయంత్రం 4 గంటలకు, మెదక్‌లో సాయంత్రం 6 గంటలకు ఖర్గే పాదయాత్ర నిర్వహిస్తారు. అక్కడే ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. అసలు కర్ణాటకలో తమ ప్రభుత్వం ఏం చేస్తోంది? బీఆర్ఎస్ ఆరోపణల్లో వాస్తవమెంత అనే అంశాలపై ప్రసంగాలతోనే బదులివ్వనున్నారు కాంగ్రెస్ నేతలు. అలాగే.. తెలంగాణలో కాంగ్రెస్ ఎందుకు గెలవాలి.. గెలిస్తే ఏం చేస్తుంది అనే అంశాలను ప్రస్తావిస్తూనే.. అభ్యర్థుల తరపున ప్రచారం చేయనున్నారు కర్ణాటక లీడర్లు.
