Site icon NTV Telugu

Expressway: సీఎం గారు.. నా కారు మీరే బాగుచేయించాలి

Cm Car

Cm Car

Expressway: ఆరు రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించిన కర్ణాటకలోని బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వే భారీ వర్షాల కారణంగా నీటిలో మునిగిపోయింది. బెంగళూరులోని రామనగర జిల్లా సమీపంలో శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి 8,480 కోట్ల రూపాయలతో నిర్మించిన హైవే నీట మునిగింది. హైవే అండర్ బ్రిడ్జి జలమయం కావడంతో ప్రమాదాలు, ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి.

“నా కారు వర్షం నీటిలో సగం వరకు మునిగిపోయి ఆగిపోయింది. ఆ సమయంలో వెనుక వస్తున్న లారీ కారును ఢీకొట్టింది, దీనికి బాధ్యులెవరు? నా కారును బాగు చేయమని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మేని అభ్యర్థిస్తున్నాను. ప్రధాన మంత్రి ఈ రహదారిని ప్రారంభించారు. అయితే ఆయన ఆ రోడ్డును తనిఖీ చేశారా? ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందో లేదో రవాణా మంత్రిత్వ శాఖ తనిఖీ చేసిందా? అని వికాస్ అనే ప్రయాణికుడు అడిగాడు.

Read Also: Mahogany Trees : ఎకరా భూమి ఉన్నా.. మీరు కోటీశ్వరులైనట్లే

ప్రయాణికుల నిరసనలు, మీడియాలో వచ్చిన కథనాలతో నేషనల్ హైవే అథారిటీ అధికారులు నీటి కుంటలు ఏర్పడిన ప్రాంతాలకు చేరుకుని తనిఖీలు చేపట్టారు. అధిక టోల్ రేట్లు, అసంపూర్తిగా ఉన్న పనులు, ఆసుపత్రులు లేకపోవడం, మరుగుదొడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు వంటి బహుళ సమస్యలపై ప్రారంభోత్సవం ముగిసిన వెంటనే ఈ ఎక్స్‌ప్రెస్‌వే పై కాంగ్రెస్, జెడిఎస్ కార్యకర్తలు నిరసనలను చేపట్టారు.

Exit mobile version