PM Modi’s Roadshow: కర్ణాటక రోడ్ షోలో ప్రధాని పైకి మొబైల్ ఫోన్ విసిరిన మహిళ..

Modi

Modi

PM Modi’s Roadshow: కర్ణాటకలో ఎన్నికల ప్రచారాలు ఊపందుకున్నాయి. బడా నాయకులంతా ఎన్నికల ప్రచారంలో నిమగ్నపోయారు. ప్రధాని నరేంద్రమోడీ కూడా అక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మోడీ కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం రెండో రోజు భారీ రోడ్ షో నిర్వహించారు. మైసూరులో ఆరు బహిరంగ సభలు, రోడ్ షోలలో పాలుపంచుకున్నారు. అయితే, మైసూరులో రోడ్ షోలో ప్రధాని మోడీ కాన్వాయ్ పై ఓ మహిళ సెల్ ఫోన్ విసిరారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ ప్రచారాన్ని మరింతగా పెంచడానికి ప్రధాని మోడీ మైసూరులో తన మద్దతుదారులతో సమావేశమవుతున్న సమయంలో, ఒక మొబైల్ ఫోన్ ను జనం లోపలి నుండి గుర్తుతెలియని వ్యక్తి ప్రధాని కాన్వాయ్ పైకి విసిరాడు.

Read Also:MIvs RR : రాజస్థాన్ ను చిత్తచేసిన ముంబై ఇండియన్స్

రోడ్ షోకు సంబంధించిన వీడియోలో, జనం వైపు చేతులు ఊపుతున్నప్పుడు ఒక ఫోన్ వాహనం వైపు విసరడం కనిపించింది. అయితే, ఇది కావాలని చేసిన పనికాదని సమాచారం. ప్రధానిపై పూలు విసురుతున్న సమయంలో గుంపులోని ఎవరో పొరపాటుగా ప్రమాదవశాత్తు మొబైల్ ను విసిరినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఎలాంటి దురుద్దేశం లేని ఓ మహిళా బీజేపీ కార్యకర్త ఉత్సాహంతో ఫోన్ విసిరినట్లు పోలీసులు తెలిపారు. ప్రధాని మోడీజీ చుట్టూ ఎస్పీజీ రక్షణ వలయం ఉంది, ఓ మహిళా కార్యకర్త ఫోన్ పొరపాటుగా ప్రధాని కాన్వాయ్ పై పడింది. ఆ తర్వాత ఎస్పీజీ సిబ్బంది ఆమెకు ఫోన్ తిరిగి ఇచ్చారని అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) అలోక్ కుమార్ తెలిపారు. కాగా, ప్రధాని రోడ్ షో నగరంలోని వివిధ ప్రాంతాల గుండా సాగింది. అన్ని ప్రధాన పార్టీలు భావిస్తున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మే 10న జరగనుండగా, మే 13న ఫలితాలు వెలువడనున్నాయి.

Read Also:Rain In Hyderabad : భారీ వర్షం.. తడిసి ముద్దైన హైదరాబాద్‌