Karimnagar: ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినులను అసభ్యకరంగా తాకుతూ, బాత్‌రూముల్లో కెమెరాలు పెట్టి వీడియోలు తీస్తూ ఏడాదిగా వేధింపులకు గురి చేస్తున్న కీచక అటెండర్ యాకుబ్ పాషా బాగోతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా ‘‘కురిక్యాల’’లో చోటు చేసుకుంది. ఈ అంశంపై జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. సఖి కౌన్సిలింగ్ నిర్వాహకుల ద్వారా యాకుబ్ పాషా దారుణాలను కలెక్టర్ తెలుసుకున్నారు. పోక్సో కేసు కావడంతో వివరాలు బయటకు పొక్కకుండా రహస్యంగా విచారణ చేపట్టారు. చిన్నారులపై ఏడాది కాలంగా యాకుబ్ పాషా లైంగిక వేధింపులకు పాల్పడ్డట్టు నిర్ధారణ అయ్యింది. యాకుబ్ పాషాపై చర్యలు తీసుకోవాలని సెప్టెంబర్ లోనే హెడ్మాస్టర్ కు ఫిర్యాదు వచ్చాయి. కానీ నిందితుడిని హెచ్‌ఎం వెనుకేసుకొచ్చాడు. ఈ విషయం బయటకు చెప్పొద్దని సిబ్బందిని బెదిరించాడు. బయటకు పొక్కితే స్కూల్లోనే ఉరేసుకుని చస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడు.
READ MORE: 7800mAh బ్యాటరీ, 50MP కెమెరా.. OnePlus Ace 6 ఫోన్‌లో మైండ్ బ్లాక్ అయ్యే ఫీచర్స్ భయ్యో!
భయపడిన సిబ్బంది వెనక్కు తగ్గింది. యాకుబ్ పాషాకు వంతపాడినట్లు మరో ఇద్దరు సిబ్బందిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడిని తమదైన పద్దతిలో విచారిస్తున్నారు పోలీసులు.. నిందితుడు చేసిన ఆక్రుత్యాలను, తీసిన వీడియోలను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు.. అభం శుభం తెలియని చిన్నారులపై పాషా లైంగిక వేధింపులపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సీరియస్ అయ్యారు. చట్ట ప్రకారం కఠినాతి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. చిన్నారుల విషయంలో తప్పుగా ప్రవర్తించాలంటేనే వణికిపోయేలా పాషాకు శిక్ష పడాలని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. బాధితుల వివరాలు బయటకి తెలియకుండా గోప్యంగా ఉంచాలని తెలిపారు.
READ MORE: Darshan Posani : జూనియర్ ప్రభాస్ గా సూపర్ స్టార్ మహేశ్ మేనల్లుడు