Bandi Sanjay : ‘గతంలో బీఆర్ఎస్ సహా కొన్ని పార్టీల నాయకులు రైల్వే అభివృద్ధిపై కేవలం లేఖలు రాసి బాధ్యతను దూరం చేసుకున్నారు. కానీ ఇప్పుడు అభివృద్ధి కనిపిస్తున్నాక – ఇదంతా తమ వల్లే జరిగిందని ప్రచారం చేస్తున్నారు. మాటలకే పరిమితమవ్వకుండా వాస్తవిక ఫలితాలు చూపాలన్నది ప్రధాన విషయం. బుల్లెట్ దిగిందా? లేదా? అనేది ప్రజలే తేల్చాలి,’’ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు.
అమృత్ భారత్ పథకం కింద ఆధునీకరించిన కరీంనగర్ రైల్వే స్టేషన్ ప్రారంభ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గతంలో ఎవరి పాలనలో అభివృద్ధి జరిగిందో కరీంనగర్ స్టేషన్ మార్పే నిదర్శనమన్నారు. అలాగే, జమ్మికుంట రైల్వే స్టేషన్‌ను కూడా అమృత్ భారత్ పథకంలో చేర్చేందుకు ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.
61 కిలోమీటర్ల మేర ఈ లైన్ నిర్మాణానికి సర్వే పూర్తయ్యిందని, డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) కూడా సిద్ధమైందని చెప్పారు. దీని కోసం రూ.1480 కోట్ల వ్యయం అంచనా వేసినట్టు వివరించారు. త్వరలో కేంద్రం ఈపై నిర్ణయం తీసుకుంటుందన్నారు. కరీంనగర్ నుంచి తిరుపతికి నిత్య రైలు నడిపేందుకు తనతో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా లేఖలు రాశారని చెప్పారు. అయితే, రద్దీ , సాంకేతిక కారణాల వల్ల అది సాధ్యపడలేదని, ప్రస్తుతం వారానికి రెండు సార్లు నడుస్తున్న ఈ రైలును నాలుగు సార్లు నడిపేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Shocking: మెట్రోలో హిడెన్ కెమెరాలు.. మహిళల గోప్యతకు గొడ్డలిపెట్టు..?
దేశవ్యాప్తంగా రూ.25 వేల కోట్ల వ్యయంతో 1350 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామని, వాటిలో భాగంగా రూ.2 వేల కోట్లతో ఆధునీకరించిన 103 స్టేషన్లను ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్‌గా ప్రారంభించారని అన్నారు. కరీంనగర్ స్టేషన్ కూడా వాటిలో ఒకటి. రూ.27 కోట్ల వ్యయంతో జరిగిన ఆధునీకరణ పనుల తరువాత కరీంనగర్ రైల్వే స్టేషన్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని తెలిపారు. ఎయిర్‌పోర్టు స్థాయిలో సదుపాయాలు కలిగిన ఈ స్టేషన్‌లో లిఫ్టులు, ఎస్కలేటర్లు, ఎసీ/నాన్‌ఎసీ వెయిటింగ్ హాల్స్, ఫుడ్ కోర్టులు, టాయిలెట్లు, సోలార్ ప్లాంట్ వంటి అనేక సదుపాయాలు ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రజలు సెల్ఫీలు తీసుకునే స్థాయికి ఇది చేరిందని ఆయన తెలిపారు.
గత 11 ఏళ్లలో రాష్ట్రంలో 20కి పైగా ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామని, మొత్తం 2,298 కిలోమీటర్ల పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఒక్క తెలంగాణకే రూ.42,119 కోట్ల విలువైన పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మాత్రమే రూ.5,337 కోట్ల బడ్జెట్ కేటాయించామన్నారు. జమ్మికుంట రైల్వే స్టేషన్‌ను త్వరలో అమృత్ భారత్ పథకంలో చేర్చుతామని, ఉప్పల్ ఆర్వోబీ నిర్మాణంలో కూడా ఒక లైన్‌ను త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. హసన్‌పర్తి–కరీంనగర్ నూతన రైల్వే మార్గానికి సంబంధించిన అన్ని చర్యలు వేగంగా పూర్తవుతాయని తెలిపారు.
Shoyu : నాగ చైతన్య రెస్టారెంట్ ఫుడ్‌లో బొద్దింక.. పోస్ట్ వైరల్