NTV Telugu Site icon

Karimnagar: బీఆర్ఎస్‌లో ముదిరిన వార్.. మాజీ మేయర్‌పై మేయర్ ఫైర్

Brs1

Brs1

కరీంనగర్ స్మార్ట్ సిటీ పనుల పేరుతో అక్రమాలంటూ మాజీ మేయర్ రవీందర్ సింగ్ మేయర్ సునీల్ రావుపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హయాంలో సీఎం కేసీఆర్ మంజూరు చేసిన 130 కోట్ల స్మార్ట్ సిటీ నిధులలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఆయన మున్సిపల్ కమిషనర్‌కు వినతి పత్రం అంజేశారు. ఆయన వినతి పత్రాన్ని పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ గతంలోని బిల్లులు జరగబోయే బిల్లులను ఆఫ్‌లైన్ ద్వారా విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ ఆదేశాలపై స్పందించిన మాజీ మాజీ మేయర్ ధన్యవాదాలు తెలుపుతూ కమిషనర్ ఆదేశానలు స్వాగతిస్తున్నానన్నారు.

Also Read: Kodali Nani: సీఎం జగన్‌పై కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు.. అవి ఎప్పుడూ చేయని నేత..!

ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. స్మార్ట్ సిటీ పనులలో నాణ్యత పై ప్రభుత్వ అధికారులపై తక్షణమే చర్య తీసుకోవాలని కమిషనర్ కు వినతి పత్రాన్ని అందజేశానన్నారు. నేను పార్టీకి వ్యతిరేకం కాదు అవినీతికి మాత్రమే వ్యతిరేకం. అవినీతికి పాల్పడిన వారిపై పోరాటం చేసేందుకు ముందుంటా అని వ్యాఖ్యానించారు. మరోవైపు మాజీ మేయర్ రవీందర్ సింగ్ ఆరోపణలను మేయర్ సునీల్ రావు ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్మార్ట్ సిటీ పనులపై అవినీతి ఆరోపణలు చేసిన రవీందర్ సింగ్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘కాంట్రాక్టర్లను బెదిరించడం, ఇబ్బంది పెట్టడం, ఏళ్ల తరబడి స్మార్ట్ సిటీ పనులను పెండింగ్ పెట్టడం రవీందర్ సింగ్‌కు వెన్నతో పెట్టిన విద్య. రవీందర్ సింగ్ కు కనీస ఇంగిత జ్ఞానం లేదు.

Also Read: TS Assembly: కోమటిరెడ్డి వర్సెస్ జగదీష్ రెడ్డి.. సభలో కరెంట్ మంటలు

మా పాలకవర్గం పనితీరు పై నిరాధారమైన ఆరోపణలు చేయడం చాలా దురదృష్టకరం. స్మార్ట్ సిటీ పనుల్లో ఎక్కడ కూడ నిబంధనలకు వ్యతిరేకంగా, ఉల్లంఘించి పనులు చేయలేదు. స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులు పూర్తి చేయాలనే ద్యాసతో ప్రజలకు స్మార్ట్ సిటీ ఫలాలు అందాలనే ఉద్దేశంతో న్యాయంగా, నిజాయితీగా మా పాలకవర్గం పని చేస్తుంది. గంగుల కమలాకర్, వినోద్ కుమార్ నాయకత్వంలో మా పాలకవర్గం టీం వర్క్‌గా పని చేస్తున్నాం. రోడ్లు వేయకుండానే బిల్లులు తీసుకున్నారనే ఆరోపణలను దమ్ముంటే నిరూపించాలి. ఎలాంటి విచారణకైనా మేము సిద్ధం. ఆరోపణలు తప్పని తేలితే రవీందర్ సింగ్ ముక్కు నేలకు రాసి… బహిరంగ క్షమాపణ చెప్పాలి’ అని మేయర్ సునీల్ రావు డిమాండ్ చేశారు.

Show comments