Lok Sabha Elections 2024: కరీంనగర్ పార్లమెంట్ స్థానం పరిధిలో పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. పోలింగ్ సామాగ్రితో సాయంత్రం వరకు పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్ళనున్న సిబ్బంది.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 29.79 లక్షల మంది ఓటర్లు ఉండగా.. కరీంనగర్ లోకసభ స్థానం పరిధిలో 17 లక్షల 97 వేల150 మంది ఓటర్లు ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో 5, 852 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ఉమ్మడి కరీంనగర్ పరిధిలో 1, 466 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకమైనవిగా గుర్తించి అక్కడ పకడ్బందీ భద్రతాను ఏర్పాటు చేశారు. అలాగే, ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఆఖరి ప్రయత్నంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు చేస్తున్న ప్రయత్నాలను ఈసీ తిప్పికొడుతుంది.
Read Also: police chaging car: పోలీసు తనిఖీ నుంచి తప్పించుకున్న వాహనం పల్టీ.. రూ. కోటిన్నర స్వాధీనం
కాగా, రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో 28 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 17 లక్షల 97 వేల 150 మంది ఓటర్లలో పురుషుల కంటే 42 వేల మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. వారంతా ఓటు హక్కు వినియోగించుకునేలా 2, 194 పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. 288 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకమైనవిగా గుర్తించి పటిష్టమైన చర్యలు చేపట్టారు. పోలింగ్ నిర్వహణ కోసం 10, 200 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. 215 రూట్లలో 216 మంది సెక్టార్ ఆఫీసర్లల నియామించారు. ఈవీఎంలను తీసుకెళ్లే వాహనాలకు జీపీఎస్ అనుసంధానం చేయగా.. ఇప్పటికే తనిఖీలు ముమ్మరం చేయగా 9 కోట్ల రూపాయల వరకు నగదు పట్టిబడింది. రెండు కోట్ల 16 లక్షల రూపాయల విలువ చేసే మద్యం సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అలాగే, 5, 500 బ్యాలెట్ యూనిట్స్, 2, 743 కంట్రోల్ యూనిట్స్, 3,077 వీవీ ప్యాట్స్ ను సిద్ధం చేసినట్లు ఈసీ తెలిపింది. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా ప్రతి ఒక్కరు సహకరించాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి పమేలా సత్పతి కోరారు. ఇప్పటికే 16 ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు ఈసీ వెల్లడించింది.
Read Also: Elections 2024: ములుగు జిల్లాలో పోలింగ్ కు సర్వం సిద్ధం..
ఇక, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈసీ పేర్కొనింది. ఎస్సీ రిజర్వుడు స్థానమైన పెద్దపల్లిలో 33 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 15 లక్షల 96 వేల 430 మంది ఓటర్లు ఉండగా.. 1850 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 221 సమస్యత్మాక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. 497 పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్, 131 పోలింగ్ కేంద్రాలలో సీసీ కెమెరాల ఏర్పాటు చేయడంతో పాటు తీవ్రవాద ప్రాబల్యం గల మంథని, మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్ అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ నిర్వహించబోతున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. పెద్దపల్లి, రామగుండం, ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్ లలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
Read Also: Lok Sabha Elections 2024: ఈ ఎన్నికల్లో యంగ్ ఓటర్స్ ఎవరి వైపు..?
అలాగే, పోలింగ్ విధుల కోసం 10, 216 మంది సిబ్బంది నియామించినట్లు ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది. ప్రతి ఒక్కరు స్వేచ్చగా నిర్బయంగా ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. తనిఖీలలో ఇప్పటి వరకు 2 కోట్ల 12 లక్షల 23 వేల 742 రూపాయలను సీజ్ చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. ఫ్రీ అండ్ ఫేర్ ఎన్నికల నిర్వహణే లక్ష్యం చర్యలు చేపట్టినట్లు తెలిపారు. పార్లమెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా 3, 220 మంది పోలీసులతో పాటు ఐదు కంపెనీ సెంట్రల్ ఫోర్స్ బందోబస్తు నిర్వహిస్తున్నట్లు రామగుండం సీపీ ఎం. శ్రీనివాస్ వెల్లడించారు.