Kapil Dev: “వైభవ్‌లో సచిన్, కోహ్లీ స్థాయి టాలెంట్ ఉంది కానీ”.. దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ బిగ్ వార్నింగ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kapil Dev: భారత క్రికెట్ దిగ్గజం, వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ కపిల్ దేవ్ యువ బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల జల్లు కురిపించారు. గతంలో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీలలో మాత్రమే కనిపించిన అసాధారణమైన సహజ సిద్ధమైన ప్రతిభ ఇప్పుడు 15 ఏళ్ల వైభవ్‌లో కనిపిస్తోందని కొనియాడారు. అయితే, అదే సమయంలో ఈ యువ ఆటగాడి చుట్టూ జరుగుతున్న మితిమీరిన ప్రచారాన్ని (hype) కాస్త తగ్గించాలని, కెరీర్‌ను అంచనా వేయడానికి ముందు అతనికి తగినంత సమయం ఇవ్వాలని కపిల్ దేవ్ సూచించారు.
బీహార్‌కు చెందిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగి ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. తన భయమెరుగని బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించాడు. ఐపీఎల్ 2025 సీజన్లో కేవలం 7 మ్యాచ్‌ల్లోనే 36 సగటుతో, 206 కి పైగా స్ట్రైక్ రేట్‌తో 252 పరుగులు చేసిన వైభవ్.. ఐపీఎల్ 2026 సీజన్లో అంతకంటే అద్భుత ప్రదర్శన చేశాడు. అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచి ఆరెంజ్ క్యాప్ కైవసం చేసుకున్నాడు. ఈ మెరుపు ప్రదర్శనల కారణంగానే అతనికి ఐర్లాండ్, ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌ల కోసం భారత జాతీయ జట్టు నుంచి పిలుపు వచ్చింది.
Also Read
ఇక, వైభవ్ ఆట గురించి కపిల్ దేవ్ స్పందిస్తూ.. “నేను అతని ఆటను పూర్తిగా చూడలేదు. అక్కడక్కడా కొన్ని క్లిప్స్ మాత్రమే చూశాను. కానీ నేను చూసినంత వరకు అతనిలో అపారమైన ప్రతిభ ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే, ప్రస్తుతం అతని గురించి ప్రజలు చాలా ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఆ అబ్బాయికి కొంత సమయం ఇవ్వండి. ఇప్పుడే అంతగా ఆకాశానికి ఎత్తేయకండి. ఇంత చిన్న వయసులో బహుశా తన సామర్థ్యం ఏంటో తనకే పూర్తిగా తెలిసి ఉండకపోవచ్చు” అని పేర్కొన్నారు. అన్ని ఫార్మాట్లలోనూ వైభవ్ తనను తాను నిరూపించుకోవాలని కపిల్ ఆకాంక్షించారు. సచిన్, కోహ్లీలతో అతని ప్రతిభను పోల్చినప్పటికీ.. టీ20 క్రికెట్‌కు ఆవల వైభవ్‌కు అసలైన పరీక్ష ఎదురవుతుందని, అక్కడ టెక్నిక్, సంయమనం చాలా అవసరమని చెప్పారు. “ప్రతిభ పరంగా చూస్తే అతను కచ్చితంగా సచిన్, విరాట్ కోహ్లీల స్థాయిలో ఉన్నాడు. కానీ అది కేవలం టీ20 క్రికెట్లోనే. మిగిలిన ఫార్మాట్లలో అతను ఇంకా నిరూపించుకోవాల్సి ఉంది. రేపు అతను టెస్ట్ క్రికెట్ ఆడేటప్పుడు, ఎవరైనా బౌలర్ వరుసగా ఐదు ఓవర్లు మెయిడెన్ వేస్తే దాన్ని తట్టుకుని నిలబడగలడా? అదే ఇక్కడ అసలైన ప్రశ్న. వీరేంద్ర సెహ్వాగ్ లాంటి వాళ్లు ఇలా ఆలోచించకపోవచ్చు, కానీ క్రికెట్ సాగే విధానం ఇదే. టీ20 విషయానికొస్తే అతను అద్భుతమైన ఆటగాడు. ఇంత చిన్న వయసులోనే అంతటి ఇంపాక్ట్ చూపించగలిగే వారు ప్రపంచంలో ఒక శాతం కూడా ఉండరు” అని కపిల్ దేవ్ విశ్లేషించారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓడిపోతామనుకున్నా.. అక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది..
-
Shai Hope: అదే మా కొంప ముంచింది.. చాలా బాధగా ఉంది.. వెస్టిండీస్ కెప్టెన్ ఆవేదన..
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!