NTV Telugu Site icon

Kapapa SP Transfer: కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు బదిలీ

Kadapa Sp

Kadapa Sp

Kapapa SP Transfer: కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజును బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఆయన స్థానంలో అన్నమయ్య జిల్లా ఎస్పీ వాసన విద్యాసాగర్ నాయుడును ఇన్చార్జిగా నియమించారు. బదిలీ అయిన హర్షవర్ధన్ రాజును డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలలో పేర్కొన్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత ఆధ్వర్యంలో టీడీపీ నేతలు ఈ ఎస్పీ మాకు వద్దని ఫిర్యాదు చేయడంతో ఆయనపై బదిలీ వేటు పడినట్లు తెలుస్తోంది. తమకు సహకరించడం లేదని తాము చెప్పిన పనులు చేయడం లేదని టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇంచార్జీలు, ఇంచార్జి మంత్రి సవితకు ఫిర్యాదు చేశారు. ఈరోజు విజయవాడలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఆమె ఇదే అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో కడప ఎస్పీ పై బదిలీ వేటు పడినట్లు తెలుస్తోంది… అయితే వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్ర రవీంద్రారెడ్డి కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించారని అందుకే బదిలీ చేశారని జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

Read Also: Ambati Rambabu: వైసీపీ కార్యకర్తలను అన్యాయంగా అరెస్ట్ చేశారు..

Show comments