Site icon NTV Telugu

Kanyadan Policy: రోజూ రూ.75 ఇన్వెస్ట్ చేస్తే.. రూ.14 లక్షలు పొందవచ్చు..

Lic Policy

Lic Policy

కరోనా తర్వాత పరిస్థితుల తర్వాత ఇప్పుడు జనాలు పొదుపు పథకాల వైపు మొగ్గు చూపిస్తున్నారు. ఇక ప్రభుత్వం కూడా కొన్ని అద్భుతమైన స్కీమ్ లను అందుబాటులోకి తీసుకొని వస్తున్నారు..ఇప్పటికే ఎడ్యుకేషన్‌, సేవింగ్స్‌, పెళ్లి వంటి అవసరాలను తీర్చేలా లంప్‌ సమ్‌ అమౌంట్‌ అందించే పథకాలు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి..లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎల్‌ఐసీ కన్యాదాన్ పాలసీ పేరిట సేవింగ్స్‌ ప్లాన్‌ లాంచ్‌ చేసింది. బాలికల విద్య, వివాహ ఖర్చులకు ఆర్థిక తోడ్పాటు అందించేలా ఈ పాలసీని రూపొందించారు. దీని ఫీచర్లు, ప్రయోజనాలు తెలుసుకుందాం..

తల్లి దండ్రులు తమ కూతురు కోసం ఈ ప్లాన్ ను తీసుకోవచ్చు.. అందుకు కోసం పాప వయస్సు ఏడాది ఉండాలి..తల్లిదండ్రుల వయస్సు తప్పనిసరిగా 18 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ అకౌంట్‌కి మినిమం గ్యారంటీడ్ అమౌంట్‌ రూ.1 లక్ష. 13 నుంచి 25 సంవత్సరాల మెచ్యూరిటీ వ్యవధి వరకు పాలసీని కలిగి ఉండవచ్చు. లబ్ధిదారుడు సహజ కారణాలతో మరణిస్తే, LIC గ్రహీత కుటుంబానికి రూ.5 లక్షల డెత్ బెనిఫిట్‌ చెల్లిస్తుంది. కష్టాల్లో ఉన్న కుటుంబానికి ఆర్థిక భరోసా అందిస్తుంది..

అనుకోని కారణాలతో పాలసీ తీసుకున్న వ్యక్తి మరణిస్తే..రూ.10 లక్షల డెత్‌ బెనిఫిట్‌ చెల్లిస్తుంది. ఇది ఫైనాన్షియల్‌ సెక్యూరిటీని కాస్త మెరుగుపరుస్తుంది.. ఇన్సూరెన్స్‌ మెచ్యూరిటీ తేదీకి మూడు సంవత్సరాల ముందు వరకు లైఫ్ రిస్క్ కవరేజీని అందిస్తుంది. పాలసీ వ్యవధి అంతటా ఇన్సూరెన్స్‌ చేసిన వ్యక్తికి ప్రొటెక్షన్‌ ఉంటుంది.3 సంవత్సరాలు ప్రీమియంలు చెల్లిస్తూ, పాలసీ యాక్టివ్‌లో ఉంటే.. పాలసీ ఆధారంగా లోన్ పొందవచ్చు. ఈ ఫీచర్ అత్యవసర సమయంలో లేదా ఊహించని ఆర్థిక అవసరాలను తీర్చడానికి ఉపయోగపడుతుంది.. ఇకపోతే రూ.75 రూపాయలతో ఇన్వెస్ట్ చేస్తే కుమార్తె వివాహానికి రూ.14 లక్షలు కూడబెట్టుకోవచ్చు. నెలవారీ ప్రీమియం 25 సంవత్సరాల పాటు చెల్లించాలి..మరిన్ని వివరాలకు దగ్గరలోని lic లో తెలుసుకోవచ్చు..

Exit mobile version