Site icon NTV Telugu

IND vs BAN: వర్షం కారణంగా టాస్‌ ఆలస్యం.. మ్యాచ్ ఆరంభం ఎప్పుడంటే?

Ind Vs Ban Toss

Ind Vs Ban Toss

కాన్పూర్‌ వేదికగా భారత్‌, బంగ్లాదేశ్‌ జట్ల మధ్య రెండో టెస్టు కాస్త ఆలస్యంగా ఆరంభం కానుంది. వర్షం కారణంగా గ్రీన్ పార్క్ మైదానం తడిగా ఉండటంతో.. ఉదయం 9 గంటలకు పడాల్సిన టాస్‌ ఆలస్యమయింది. మైదానాన్ని పరిశీలించిన ఫీల్డ్ అంపైర్లు.. టాస్‌ 10 గంటలకు ఉంటుందని, మ్యాచ్ 10.30కు ప్రారంభమవుతుందని తెలిపారు. షెడ్యూల్ ప్రకారం మ్యాచ్ ఉదయం 9.30 గంటలకు ఆరంభం కావాల్సింది.

కాన్పూర్‌ టెస్టుకు వర్షం అంతరాయం కలిగించొచ్చని వాతావరణ శాఖ ముందే చెప్పింది. వర్షం కారణంగా తొలి, మూడో రోజు ఆట పూర్తిగా సాగే అవకాశాలు తక్కువే అని పేర్కొంది. అంతేకాదు ప్రతి రోజూ చివరలో వెలుతురు సమస్య ఎదురుకావొచ్చు. కాన్పూర్‌లో నల్లమట్టి పిచ్‌పై బౌన్స్‌ తక్కువగా ఉంటుంది. అయితే వర్షం కారణంగా పిచ్‌లో మార్పు ఉండొచ్చు. ఇప్పటికే రెండు టెస్టుల సిరీస్‌లో ఒక టెస్టు గెలిచిన భారత్‌.. 1-0 ఆధిక్యంలో ఉంది.

తుది జట్లు (అంచనా):
భారత్‌: రోహిత్, యశస్వి, గిల్, కోహ్లీ, పంత్, రాహుల్, జడేజా, అశ్విన్, కుల్దీప్/అక్షర్, సిరాజ్‌, బుమ్రా/ఆకాష్.
బంగ్లాదేశ్‌: షద్మాన్, జాకీర్‌ హసన్, శాంటో, మొమినుల్‌ హక్, ముష్ఫికర్, షకిబ్, దాస్, మిరాజ్, తైజుల్, హసన్‌ మహమూద్, తస్కిన్‌.

Exit mobile version