NTV Telugu Site icon

Manchu Vishnu: కేదార్‌నాథ్‌, బద్రీనాథ్ ను సందర్శించిన కన్నప్ప చిత్ర బృందం.. వీడియో వైరల్

New Project 2024 10 25t134739.739

New Project 2024 10 25t134739.739

Manchu Vishnu: డైనమిక్ హీరో మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా “కన్నప్ప”. ఈ సినిమా మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ కావడం విశేషం. ఈ సినిమాను మహాభారతం సీరియల్ కు దర్శకత్వం వహించిన ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అవా ఎంటర్టైన్మెంట్స్ , 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రీతి ముకుందన్‌ హీరోయిన్గా, ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ వంటి పాన్ ఇండియా స్టార్స్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ, స్టీఫెన్ దేవసి మ్యూజిక్ అందిస్తున్నారు.

Read Also:Flood Relief Compensation: విజయవాడ వరద బాధితులకు గుడ్‌న్యూస్.. అకౌంట్లలో నగదు జమ

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ టీజర్ 20మిలియన్ వ్యూస్ సాధించినట్లుగా చిత్ర యూనిట్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇదిలా ఉంటే ఈ సినిమాను మంచు విష్ణు డిసెంబరులో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ చిత్రం వీఎఫెక్స్ పూర్తయితేనే డిసెంబర్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. లేకపోతే వచ్చే ఏడాదిలోనే విడుదల సాధ్యం కానుంది. అయితే ఈ సినిమా టీజర్ బాగున్న కూడా విఎఫ్ఎక్స్ వర్క్ పై ట్రోల్స్ రావడంతో దానిపై విష్ణు పూర్తి దృష్టి పెట్టనున్నట్లు సమాచారం.

Read Also:Janhvi Kapoor: హమ్మయ్య.. ఒక టెన్షన్ క్లియర్!

ఇది ఇలా ఉంటే.. ‘కన్నప్ప’ చిత్రబృందం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలని యూనిట్ నిర్ణయించుకుంది. ఇందులోభాగంగా మోహన్‌బాబు, విష్ణుతోపాటు ఇతర చిత్రబృందం తాజాగా కేదార్‌నాథ్‌ క్షేత్రాన్ని సందర్శించారు. దీనికి సంబంధించిన వీడియోను నెట్టింట్లో షేర్ చేశారు. ‘‘12 జ్యోతిర్లింగాల ప్రయాణాన్ని ప్రారంభించాం. పవిత్రక్షేత్రం కేదార్‌నాథ్‌ను సందర్శించాం. కన్నప్ప సినిమా కోసం ప్రార్థించాం’’ అని మంచు విష్ణు రాసుకొచ్చారు. కన్నప్ప చిత్రం అధికభాగం షూటింగ్‌ న్యూజిలాండ్‌లో జరిగింది. కన్నప్ప భక్తి చిత్రం మాత్రమే కాదని, అదొక చరిత్ర అని మోహన్‌బాబు ఓ సందర్భంలో అన్నారు.