Site icon NTV Telugu

Tollywood : టాలీవుడ్ లో సెటిల్ అవుతన్న పరభాష హీరోలు.. మన వాళ్ళకి ఇబ్బంది తప్పదు

Tollywood (1)

Tollywood (1)

టాలీవుడ్ పాన్ ఇండియా స్టాయి దాటి హాలీవుడ్ రేంజ్‌కు చేరాక ఇతర ఇండస్ట్రీ యాక్టర్ల టాలివుడ్ పై దండయాత్ర స్టార్టయ్యింది. బాలీవుడ్ నుండి హీరోయిన్స్, విలన్స్ హడావుడి పెరిగింది. ఇక సౌత్‌లో ఏ స్టార్ హీరో సినిమా స్టార్ట్ చేసినా తెలుగు మార్కెట్ కొల్లగొట్టేందుకు ఇక్కడ డబ్ చేస్తున్నారు. ఈ ప్రయత్నాలు సార్లు వర్కౌటై కొన్ని సార్లు బెడిసికొట్టాయి. దీంతో ఇలా కాదని టాలీవుడ్‌ ప్రేక్షకులకు నేరుగా చేరువయ్యేందుకు తమ ఇమేజ్ పెంచుకునేందుకు ఫోకస్ పెంచుతున్నారు స్టార్ హీరోస్. కార్తీ ఎప్పుడో ఈ స్టెప్ తీసుకోగా రీసెంట్లీ జాయిన్ అయ్యారు దుల్కర్ అండ్ రిషబ్ శెట్టి.

Also Read : Exclusive : అనుష్క ‘ఘాటీ’ రిలీజ్ డేట్ ఇదే

ఊపిరితో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన కార్తీని బ్రదర్ ఫ్రం అనదర్ మదర్‌గా ట్రీట్ చేస్తోంది టాలీవుడ్. ఈ మధ్య డబ్బింగ్ చిత్రాలతో పలకరించినా హిట్4తో మరోసారి ఇక్కడి ఆడియన్స్‌ ను పలకరించాడు. ఇక దుల్కర్ సల్మాన్ సంగతి చెప్పనక్కర్లేదు మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చి ఓన్ చేసేసుకున్నారు తెలుగు మూవీ లవర్స్. నెక్ట్స్ కాంత, ఆకాశంలో ఓ తార లాంటి స్ట్రైట్ ఫిల్మ్స్ చేస్తున్నాడు. వీరితో పాటు సూర్య, ధనుష్ బై లింగ్వల్ ఫిల్మ్స్‌తో లేదా టాలీవుడ్ దర్శకులతో టయ్యప్ అవుతూ ఇక్కడి మార్కెట్‌పై దుల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక కాంతార ఫేం రిషబ్ శెట్టి ఇటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్‌పై ఏకకాలంలో ఫోకస్ చేస్తున్నాడు. చత్రపతి శివాజీ ఆధారంగా ఓ బాలీవుడ్ మూవీకి కమిటైన రిషబ్ తెలుగులో నేరుగా జై హనుమాన్‌తో పాటు నాగ వంశీ ప్రొడక్షన్‌లో ఓ మూవీకి కమిటయ్యాడు. ఇలా సదరన్ ఇండస్ట్రీలోని ఇతర స్టార్ హీరోలు టాలీవుడ్‌పై ఫోకస్ చేసి తమ ఇమేజ్, మార్కెట్ పెంచుకునేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఈ పరంపర కంటిన్యూ అయితే మన మిడిల్ రేంజ్ హీరోలపై ఎఫెక్ట్ చూపే ఛాన్స్ ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు.

Exit mobile version