NTV Telugu Site icon

Kichcha Sudeep: ప్రభాస్‌ వ్యక్తిత్వం పై కన్నడ హీరో కీలక వ్యాఖ్యలు..

Kiccha Pradeep

Kiccha Pradeep

కిచ్చా సుదీప్ కన్నడ స్టార్ హీరో. రాజమౌళి పుణ్యమా అని తెలుగులో కూడా మంచి ఫేమస్ అయ్యాడు. ఈ మధ్య ఆయన చేస్తున్న కన్నడ సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. ‘విక్రాంత్ రోణ’ తర్వాత కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ పూర్తి స్థాయి హీరోగా నటించిన ‘మ్యాక్స్’ సినిమా కన్నడనాట సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. వెర్సటైల్ ఆర్టిస్ట్ వరలక్ష్మీ శరత్ కుమార్, పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన టాలీవుడ్ నటుడు సునీల్ కీలక పాత్రల్లో నటించారు. వి క్రియేషన్స్, కిచ్చా క్రియేషన్స్ సంస్థలపై తమిళ టాప్ ప్రొడ్యూసర్ కలైపులి ఎస్ థాను ఈ చిత్రాన్ని నిర్మించారు. విజయ్ కార్తికేయ దర్శకత్వం వహించారు. డిసెంబర్ 27న ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా తెలుగులో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ అయ్యింది.

READ MORE: Nitish Kumar Reddy: చాలా టెన్షన్‌కు గురయ్యా.. సెంచరీ తర్వాత నితీష్ రెడ్డి తండ్రి భావోద్వేగం..

ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కన్నడ నటుడు కిచ్చా సుదీప్‌ ఇటీవల వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొన్నాడు. అందులో భాగంగా స్టార్‌ హీరోలు ప్రభాస్‌ , విజయ్‌ ల గురించి ప్రస్తావించాడు. ప్రభాస్.. మంచి వ్యక్తి అని చాలా సింపుల్‌ గా ఉంటారన్నాడు. “ఎలాంటి హడావుడి లేకుండా ప్రశాంత జీవితాన్ని కొనసాగిస్తుంటాడు. సక్సెస్‌ అయినా..ఫెయిల్యూర్‌ అయినా.. ఒకే విధంగా స్పందిస్తాడు. కొంచెం కూడా గర్వం ఉండదు.” అని సుదీప్‌ ప్రభాస్‌పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. కోలీవుడ్‌ హీరో విజయ్‌ తో కలిసి తాను పనిచేసినట్లు చెప్పాడు. ఆయన ఎన్నో గొప్ప కలలు కంటుంటారన్నాడు.

READ MORE: Pawan Kalyan: “ఎప్పుడు ఏ స్లోగన్‌ ఇవ్వాలో మీకు తెలియదు”.. అభిమానులపై పవన్ ఫైర్ (వీడియో)

Show comments