Site icon NTV Telugu

Darshan Arrest: హత్య కేసు.. ప్రముఖ కన్నడ నటుడు అరెస్ట్!

Actor Darshan Areest

Actor Darshan Areest

Sandalwood Actor Darshan Arrested in Murder Case: ఓ యువకుడి హత్య కేసులో ప్రముఖ కన్నడ నటుడు, ఛాలెంజింగ్ స్టార్ దర్శన్‌ తూగుదీపను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం ఉదయం మైసూరులో దర్శన్‌తో పాటు మరో పది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్య కేసులో విచారణ నిమిత్తం వారిని బెంగళూరుకు తరలించినట్లు స్థానిక మీడియా పేర్కొంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… చిత్రదుర్గలోని లక్ష్మీ వెంకటేశ్వర బరంగయ్‌లో నివాసం ఉంటున్న రేణుకా స్వామి జూన్ 1న ఇంటి నుంచి వెళ్లి తిరిగిరాలేదు. జూన్‌ 8న ఆ యువకుడు హత్యకు గురయ్యాడు. జూన్ 9వ కామాక్షిపాళ్యం సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్ పక్కన ఉన్న కాలువలో మృతదేహం కనిపించింది. కుక్కలు శవాన్ని పీక్కుతింటుండగా.. అపార్ట్‌మెంట్ సెక్యూరిటీ గార్డు పోలీసులకు సమాచారం అందించాడు. మృతుడు రేణుకా స్వామిగ పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Also Read: Gold Rate Today: మగువలకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు!

ఈ కేసులో నటుడు దర్శన్‌పై ఆరోపణలు వచ్చాయి. విచారణలో భాగంగా ఇద్దరు నిందితులు దర్శన్‌ పేరు వెల్లడించారు. దాంతో మంగళవారం ఉదయం మైసూర్‌లోని ఒక ప్రైవేట్ హోటల్‌లో దర్శన్‌ను అదుపులోకి తీసుకుని బెంగళూరుకు తీసుకువచ్చారు. చిత్రదుర్గ దర్శన్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడుగా రేణుకా స్వామి ఉన్నాడు. దర్శన్ భార్యకు రేణుకా స్వామి అసభ్యకరమైన సందేశాలు పంపినట్లు ప్రాథమిక దర్యాప్తులో తెలిసింది.

 

 

Exit mobile version