NTV Telugu Site icon

Kanguva Update: సూర్య ‘కంగువ’ అప్‌డేట్.. టీజర్‌ విడుదల ఎప్పుడంటే?

Kanguva Movie

Kanguva Movie

Suriya’s Kanguva Movie Teaser Update: కోలీవుడ్‌ అగ్ర హీరో సూర్య, దర్శకుడు శివ కాంబోలో వస్తున్న చిత్రం ‘కంగువా’. భారీ బడ్జెట్‌తో ఈ మూవీని యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వినూత్నమైన పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సూర్య పలు భిన్నమైన వేషాల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ సినిమా పార్ట్-1 2024లోనే విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ను మేకర్స్‌ తాజాగా సోషల్ మీడియాలో పంచుకున్నారు.

కంగువా సినిమా టీజర్‌ను మార్చి 19న సాయంత్రం 4:30 గంటలకు విడుదల చేస్తున్నట్లు మేకర్స్‌ తెలిపారు. మంగళవారం సాయంత్రం టీజర్‌ రిలీజ్ చేస్తున్నట్లు స్టూడియోస్‌ గ్రీన్‌ ఎక్స్‌లో అధికారిక ప్రకటన చేసింది. ‘సిద్ధంగా ఉండండి. మీ వ్యక్తిగత స్క్రీన్‌లను మండించడానికి కంగువ వస్తోంది. రేపు సాయంత్రం 4:30 గంటలకు టీజర్ విడుదల కానుంది’ అని స్టూడియోస్‌ గ్రీన్‌ ఎక్స్‌లో పేర్కొంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్‌లుక్‌, గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కింది.

Also Read: Narzo 70 Pro 5G Launch: రేపే ‘రియల్‌మీ నార్జో 70 ప్రో’ లాంచ్.. ఆఫర్‌, స్పెసిఫికేషన్‌ డీటెయిల్స్ ఇవే!

రూ.350 కోట్ల బడ్జెట్‌తో కంగువా సినిమా తెరకెక్కుతోంది. కంగ అనే ఓ పరాక్రముడి కథతో ఈ సినిమా తెరకెక్కినట్లు సమాచారం. ఇందులో సూర్య ఆరు భిన్నమైన అవతారాల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో దిశా పటానీ కథానాయిక కాగా.. బాబీ దేవోల్‌ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. జగపతి బాబు, యోగిబాబు, కోవై సరళ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీని 10 భాషల్లో విడుదల చేయనున్నారు. ఐమ్యాక్స్‌, 3డీ వెర్షన్స్‌లోనూ ఇది అందుబాటులో ఉండనుంది. రెండు భాగాలుగా వస్తున్నకంగువా పార్ట్‌-1 2024లోనే విడుదల కానుంది.

Show comments