Kanguva : సూర్య కంగువ షూటింగ్ ఫైనల్ షెడ్యూల్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం వరుస సినిమాలను చేస్తున్న విషయం తెలిసిందే. తన సినిమాల గురించి నిత్యం ఏదో ఒక అప్డేట్ షేర్ చేస్తూ అభిమానులను ఖుషీ చేస్తున్నాడు సూర్య. సూర్య నటిస్తోన్న లేటెస్ట్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా కంగువ. ఈ సినిమా కు శివ దర్శకత్వం వహిస్తున్నాడు. సూర్య 42 వ ప్రాజెక్ట్ గా వస్తోన్న కంగువ నుంచి మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన గ్లింప్స్ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.ఇటీవలే థాయ్‌లాండ్ లో కీ షెడ్యూల్ ను పూర్తి చేసిన మేకర్స్. తాజాగా ఫైనల్ షెడ్యూల్ పై అప్డేట్ బయటకు వచ్చింది. చెన్నై షెడ్యూల్ లో వార్ సీక్వెన్స్‌ను షూట్ చేయబోతున్నట్టు న్యూస్ కూడా తెర పైకి వచ్చింది. తాజా సమాచారం ప్రకారం చెన్నై లోని ఈవీపీ ఫిల్మ్ సిటీ లో ఇవాళ ఫైనల్ షెడ్యూల్ షురూ అయింది. సూర్య, బాబీడియోల్ మరియు దిశాపటానీ పై వచ్చే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు సమాచారం.
వచ్చే నెల లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టనున్నారు మేకర్స్.స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ సంయుక్తం గా తెరకెక్కిస్తున్న కంగువ థియేటర్ల లో ప్రపంచవ్యాప్తం గా 10 భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. కంగువ ౩డీ ఫార్మాట్లో కూడా సందడి చేయనుంది. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరియు మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే లాంఛ్ చేసిన కంగువ పోస్టర్లు సోషల్ మీడియా లో వైరల్ అవుతూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. 2024 వేసవి లో సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.గతానికి, ప్రస్తుతకాలానికి మధ్య ఉండే కనెక్షన్‌తో సాగే స్టోరీలైన్ ఆధారంగా కంగువ తెరకెక్కుతున్నట్టు సమాచారం.. కంగువలో సూర్య వారియర్ గా నయా అవతార్‌లో కనిపించి గూస్ బంప్స్ తెప్పిస్తున్నాడు. వారియర్ లుక్ తో సినిమా పై సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నాడు
Also Read
- IND Vs SL Test Free Entry: భారత్ - శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
- Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
- Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!