Chirag paswan: కంగనా రనౌత్‌కు చిరాగ్ సపోర్ట్.. దాడిపై ఖండన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ నటి, మండీ లోక్‌సభ ఎంపీ కంగనా రనౌత్‌కు రాజకీయ ప్రముఖుల నుంచి మద్దతు లభిస్తోంది. ఇటీవల చండీగఢ్ ఎయిర్‌పోర్టులో సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్.. కంగనాను చెంప దెబ్బ కొట్టింది. ఈ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఆమెపై దాడిని పలువురు ఖండించారు. తాజాగా లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్.. కంగనాకు మద్దతుగా నిలిచారు. ఆమెపై దాడిని ఖండించారు. ఎవరినైనా కొట్టే హక్కు ఎవరికీ లేదని చెప్పారు. ఎన్డీఏ సమావేశంలో కంగనాతో చిరాగ్ ప్రత్యేకంగా కలిసి మద్దతు తెలిపారు. ఇదిలా ఉంటే మహిళా కానిస్టేబుల్‌ను ఇప్పటికే సస్పెండ్ చేసి ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
ఇది కూడా చదవండి: Relationship Advice: మీ జీవితమంతా ఒంటరిగా ఉండండి కానీ.. ఇలాంటి వ్యక్తులతో డేటింగ్ చేయొద్దు!
Also Read
- Vijayawada: అప్పులు.. ఈఎంఐలు.. ఆర్భాటపు జీవితం.. దొంగగా మారిన 22 ఏళ్ల బీటెక్ యువకుడు..
- Modi-Xi Jinping: ‘ఈజ్ ఇట్ ఓకే?’.. షీ జిన్‌పింగ్‌ను చూసి ప్రసంగం ఆపిన మోడీ.. అసలేం జరిగిందంటే?
- Glaciers: వేడెక్కుతున్న భూమితో ఏం జరగబోతోంది?
- BRICS Currency: బ్రిక్స్ కరెన్సీపై భారత్ కీలక ప్రకటన.. కామన్ కరెన్సీపై ఫుల్ క్లారిటీ..!
కంగనాపై దాడి సరైంది కాదన్నారు. తాను ఎప్పుడూ భావ ప్రకటనా స్వేచ్ఛకు మద్దతు ఇస్తానని చిరాగ్ చెప్పారు. తాను రెండు వైపులా మాట్లాడతానన్నారు. కంగనా తన అభిప్రాయాన్ని చెప్పిందని.. అలాగే కానిస్టేబుల్ మరో రకంగా స్పందించి ఉండొచ్చన్నారు. కానీ పౌరసమాజంలో భౌతిక దాడులు, హింసకు అస్సలు చోటు ఉండకూడదని చిరాగ్ పాశ్వాన్ ఓ మీడియా సంస్థతో వ్యాఖ్యానించారు. ఒకవేళ కానిస్టేబుల్‌కు అభ్యంతరం ఉంటే కంగనా ముందే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసి ఉండొచ్చు కదా? అన్నారు. అప్పుడు ఇంకా బాగుండేదన్నారు. ఎవరైనా సరే భౌతిక దాడికి దిగే హక్కు ఎవరికీ లేదని తేల్చిచెప్పారు.
ఇది కూడా చదవండి: Chandrababu: రామోజీరావు పార్థివదేహానికి చంద్రబాబు దంపతుల నివాళి
చిరాగ్ పాశ్వాన్.. బీహార్‌లోని హాజీపూర్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. శుక్రవారం జరిగిన NDA సమావేశంలో కంగనా రనౌత్‌తో సమావేశమై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే వీరిద్దరు రాజకీయాల్లోకి రాకముందు కంగనా రనౌత్, చిరాగ్ పాశ్వాన్ 2011లో ‘మిలే నా మిలే హమ్’ అనే రొమాంటిక్ కామెడీ చిత్రంలో కలిసి నటించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ నుంచి కంగనా రనౌత్ గెలుపొందారు.
ఇది కూడా చదవండి: Groom Strange Dance: ఏంటి భయ్యా.. పెళ్లి నీదేనని మర్చిపోయావా.. ఇలా రెచ్చిపోయావు..
తాజావార్తలు
-
Hanuman Ansh: 21 ఏళ్ల నిర్మాతకు జాక్ పాట్.. బాక్సాఫీస్ కలెక్షన్స్ 250 కోట్లు… ఓటీటీ డీల్ 100 కోట్లు?..
-
CM Revanth Reddy : ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య భవన్.. రేవంత్ కీలక వ్యాఖ్యలు
-
Vijayawada: అప్పులు.. ఈఎంఐలు.. ఆర్భాటపు జీవితం.. దొంగగా మారిన 22 ఏళ్ల బీటెక్ యువకుడు..
-
Flight Turbulence: టర్కిష్ ఎయిర్‌లైన్స్ TK663 విమానంలో తీవ్ర కుదుపులు.. మూడు సార్లు ల్యాండింగ్ విఫలం, చివరికి డైవర్ట్
-
Asia Cup 2026 Final: భారత్ vs శ్రీలంక ఫైనల్.. హెడ్ టు హెడ్, లైవ్ స్ట్రీమింగ్, టీమ్ డీటెయిల్స్ ఇవే!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!