Kangana Ranaut: లేనిపోని చిక్కులను కొని తెచ్చుకుంటున్న కంగనా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kangana Ranaut: మండి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎన్నికైన బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తాజాగాచేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది. మొహర్రంకు సంతాపం తెలిపే ముస్లింల క్లిప్‌ను ఆమె రీపోస్ట్ చేశారు. హిందువులు కూడా అలాంటి యుద్ధానికి సిద్ధం కావాలంటూ పరోక్షంగా రాసుకొచ్చింది. కంగనా ట్వీట్‌పై ప్రజల నుంచి భిన్నమైన స్పందనలు కనిపిస్తున్నాయి. ముస్లింల ఈ వైఖరి భయానకంగా ఉందని కొందరు, కంగనా హిందువులను రెచ్చగొడుతోందని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎంపీగా ఉన్నందున ఇలా ట్వీట్ చేయకూడదని మరికొందరు గుర్తు చేస్తున్నారు.
Read Also:MLC 2024: అదరగొట్టిన స్టీవ్ స్మిత్.. ఛాంపియన్‌గా నిలిచిన వాషింగ్టన్ ఫ్రీడమ్..
Also Read
- Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
- Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
- YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
- OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ఆ ట్వీట్‌లో కంగనా ఏం రాసింది?
కంగనా చేసిన పోస్టులో.. ఇది వింతగా, భయానకంగా ఉంది. కానీ ఈ రకమైన ప్రపంచంలో జీవించడానికి, హిందూ పురుషులు కూడా అలాంటి పోరాటానికి అవసరమైన శిక్షణ తీసుకోవాలా? వాతావరణం దృష్ట్యా రక్తం వేడి అయ్యే సమస్యే లేదు… ఉందా? క్లిప్‌లో కొందరు వ్యక్తులు కత్తితో తలపై కొట్టడం కనిపించింది. ప్రజల తలలు, బట్టలు రక్తంతో తడిసిపోయాయి.’ అంటూ రాసుకొచ్చారు. కంగనా పోస్ట్‌పై అనేక స్పందనలు కనిపిస్తున్నాయి. హిమాచల్ పోలీసులను ట్యాగ్ చేస్తూ.. ఓ నెటిజన్ ఈ మహిళ హిందువులను రెచ్చగొడుతోంది. రక్తపాతంతో , హింసాత్మకంగా ఉండమని కోరుతోందని పేర్కొన్నాడు. మరొకరు నెటిజన్.. ఇది నిజంగా మంచిది కాదు. కానీ వారు ఇస్లాంలో దీన్ని చేయాలన్నారు. మరొక నెటిజన్ ఇది నిజంగా విచారకరమైన, భయానక దృశ్యంగా అభివర్ణించారు.

Read Also:Supreme Court: జార్ఖండ్ సీఎం హేమంత్ కు ఊరట..బెయిల్ నిర్ణయాన్ని సమర్థించిన కోర్టు
కంగనాకు నోటీసులు
హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఇటీవల బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు నోటీసులు జారీ చేసింది. మండి సీటు నుంచి పోటీ చేసేందుకు తాను దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను అన్యాయంగా తిరస్కరించారంటూ కిన్నౌర్‌వాసి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కంగనా రనౌత్‌కు కోర్టు నోటీసు అందజేసింది. ఆగస్టు 21లోగా ఆమె తన స్పందనను తెలియజేయాలని కోరింది. మండిలో కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాధిత్య సింగ్‌ను బీజేపీ తరఫున పోటీ చేసిన కంగనా రనౌత్ చేతిలో 74,755 ఓట్లతో ఓడిపోయారు. అదే ఎన్నికల్లో పోటీ చేయడానికి తాను దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను తప్పుడు కారణాలతో తిరస్కరించారని పేర్కొంటూ లాయక్ రామ్ నేగి తాజాగా కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో రనౌత్ ఎన్నికను పక్కన పెట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్‌ఫర్డ్‌కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్‌లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!