బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ నటిస్తున్న చిత్రం ఎమర్జన్సీ.. గత ఏడాది తేజస్, చంద్రముఖి-2 సినిమాలతోప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం సరికొత్త కథతో రూపోందుతున్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఈ సినిమాకు కంగనా దర్శకత్వం, నిర్మాతగా వ్యవహారిస్తున్నారు.. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, మణికర్ణిక ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో ఇందిరా గాంధీ పాత్రలో కంగనా రనౌత్ నటిస్తున్నారు.
1975లో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో జరిగిన పరిణామాలే కథాంశంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.. ఎమర్జెన్సీ పరిస్థితులలో ఇందిరా గాంధీ ఏం చేసారన్నది ఈ సినిమాలో చూపిస్తారు.. దాదాపుగా షూటింగ్ ను అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది..
ఈ ఏడాది జూన్ 14న రిలీజ్ చేయనున్నట్లు కంగనా రనౌత్ ట్వీట్ చేసింది. ఆమె ట్విటర్‌లో రాస్తూ.. ‘ఇండియా చీకటి రోజుల వెనక స్టోరీని చూడండి. జూన్ 14న ఎమర్జెన్సీ రిలీజ్ అవుతుందని సోషల్ మీడియా ద్వారా కంగనా పేర్కొన్నారు.. ఇకపోతే ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, మహిమా చౌదరి, మిలింద్ సోమన్, శ్రేయాస్ తల్పాడే, విశాక్ నాయర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎమర్జెన్సీ జూన్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది..
Unlock the story behind India’s darkest hour. Announcing #Emergency on 14th June,2024
Witness history come alive as the most feared & fiercest Prime Minister #IndiraGandhi thunders into cinemas 🔥#Emergency in cinemas on 14th June,2024@AnupamPKher #SatishKaushik… pic.twitter.com/hOBRnXt4uu— Kangana Ranaut (@KanganaTeam) January 23, 2024