Kangana Ranaut :బిల్కిస్ బానోపై సినిమా తీస్తా..స్క్రిప్ట్ కూడా సిద్ధంగా వుంది.. కానీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిల్కిస్ బానో రేప్ కేసు లో గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసిన 11 మందిని తిరిగి జైలుకు పంపించాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది.రెండు వారాల్లోగా జైలుకు తరలించాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.2002 గుజరాత్ అల్లర్లలో 5 నెలల గర్భిణీ గా ఉన్న 21 ఏళ్ల బిల్కిస్ బానో పై కొందరు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాకుండా ఆమె మూడేళ్ల కూతురితోపాటు ఏడుగురు కుటుంబ సభ్యుల్ని హత్య చేశారు. ఈ కేసు లో సీబీఐ ప్రత్యేక కోర్టు 11 మందిని దోషులుగా ఖరారు చేస్తూ 2008 లో జీవిత ఖైదును విధించింది. ఆ తరువాత బోంబే హైకోర్టు కూడా ఈ తీర్పు ను సమర్ధించింది. కాగా 15 ఏళ్ల జైలు శిక్ష అనంతరం తమను విడుదల చేయాలని కోరుతూ ఓ దోషి 2022 లో సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే..పరిశీలించాల్సిందిగా గుజరాత్ ప్రభుత్వాన్ని కోరింది.
కోర్టు సూచనతో గుజరాత్ ప్రభుత్వం ఓ కమిటీ నియమించి ఆ కమిటీ సిఫారసుల ఆధారంగా 11 మందికి రెమిషన్ విదించడంతో 2022 ఆగస్టు 15 న అంతా విడుదలయ్యారు.దీనికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. గుజరాత్ ప్రభుత్వ తీరును తప్పుబడుతూ.. వాళ్లను తిరిగి జైలుకు పంపించాలని సుప్రీం కోర్ట్ ఆదేశించింది.ఇదిలా ఉంటే ఓ సోషల్ మీడియా యూజర్ బిల్కిస్ బానో పై సినిమా తీస్తారా అని కంగనాను ప్రశ్నించాడు.అయితే బిల్కిస్ బానో స్టోరీ ని సినిమా గా తీయడంపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ స్పందించింది. ఈ మూవీ తీయడానికి తన దగ్గర స్క్రిప్ట్ సిద్ధంగా ఉన్నా ఎవరూ నిర్మించడానికి ముందుకు రావడం లేదని ఆమె చెప్పుకొచ్చింది.నిజానికి మూడేళ్లపాటు రీసెర్చ్ కూడా చేసినట్లు కంగనా సదరు యూజర్ కు చెప్పింది. అయితే ఈ ప్రాజెక్ట్ కు ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్ కూడా ముందుకు రావడం లేదని ఆమె చెప్పింది
Also Read
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!