Kane Williamson: మూడోసారి తండ్రైన కేన్ మామ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kane Williamson announces birth of his third child: న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మూడోసారి తండ్రయ్యాడు. కేన్ సతీమణి సారా రహీమ్ పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని కేన్ మామ ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. విలియమ్సన్ తన భార్య మరియు కుమార్తెతో ఉన్న ఫొటోను పోస్ట్ చేశాడు. కేన్ మామకు ఇప్పటికే మూడేళ్ల కుమార్తె, ఏడాది కుమారుడు ఉన్నారు.
‘ఈ ప్రపంచంలోనే అందమైన అమ్మాయికి స్వాగతం. మీ సురక్షిత రాక, ముందుకు సాగిన ఉత్తేజకరమైన ప్రయాణానికి కృతజ్ఞతలు’ అంటూ కేన్ విలియమ్సన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నాడు. విషయం తెలిసిన ఫాన్స్, క్రికెటర్స్ విలియమ్సన్కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ‘కంగ్రాట్స్ లెజెండ్’ అని ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కామెంట్ చేశాడు. ఇటీవలే టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా రెండోసారి తండ్రైన విషయం తెలిసిందే.
Also Read
Also Read: Jacintha Kalyan: అప్పుడు రిసెప్షనిస్ట్.. ఇప్పుడు పిచ్ క్యూరేటర్! ప్రశంసించిన జై షా
తండ్రి కాబోతున్న సందర్భరంగా ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్ నుంచి కేన్ విలియమ్సన్ తప్పుకున్నాడు. ఫిబ్రవరి 29 నుంచి ఆస్ట్రేలియాతో జరిగే రెండు టెస్టుల సిరీస్‌లో కేన్ ఆడనున్నాడు. ప్రస్తుతం విలియమ్సన్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో సెంచరీల మోత మోగించాడు. తొలి టెస్టులో 118, 109 పరుగులు చేసిన అతడు.. రెండో టెస్టులో 43, 133 రన్స్ బాదాడు. విలియమ్సన్ న్యూజిలాండ్ తరఫున ఇప్పటివరకు 98 టెస్టులు, 165 వన్డేలు, 89 టీ20లు ఆడాడు.
తాజావార్తలు
-
OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్‌కే పగ్గాలు!
-
Story Board : బంగ్లా మరో పాకిస్తాన్ లా మారుతుందా..?
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్లకు ఫుల్ డిమాండ్.. 7,340 ఇళ్లకు 35 వేల దరఖాస్తులు!
-
Russia-India Rail Route: భారత్‌కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
-
Lionel Messi’s Father Passed Away: మెస్సీ కన్నీళ్ల వెనుక అసలు కారణం ఇదేనా? తండ్రి జార్జ్ ఇక లేరు
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!