Site icon NTV Telugu

Kamal Nath: అంతా ఈ మీడియానే చేసింది.. బీజేపీలో చేరికపై కమల్‌నాథ్‌ రియాక్షన్..

Kamalnath

Kamalnath

లోక్ సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కమల్‌నాథ్‌ బీజేపీలో చేరతారనే ఊహాగానాలు గత కొద్ది రోజులుగా వినిపిస్తున్నాయి. కానీ, ఈ విషయంపై ఇవాళ తొలిసారి మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి బహిరంగ ప్రకటన చేశారు. పార్టీ మారుతున్నట్లు నేను ఎప్పుడైనా చెప్పానా, నేనే ఏదైనా సూచన చేశానా? అలాంటిదేమీ జరగలేదు అని కమల్‌నాథ్‌ ప్రశ్నించారు.

Read Also: Shivaratri 2024 Special Song: మంగ్లీ నోట ‘ఆదియోగి’ పాట.. హైప్‌ క్రియేట్‌చేస్తున్న ప్రోమో..

ఇక, అంతకుముందు ఆదివారం నాడు కాంగ్రెస్ సమావేశానికి కమల్ నాథ్ హాజరయ్యారు. లోక్‌సభ ఎన్నికలు, రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రకు సంబంధించి కాంగ్రెస్ కమిటీ ఈ సమావేశం నిర్వహించింది. ఇందులో మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు జితు పట్వారీ, వివేక్ తంఖా సహా పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ వర్చువల్ సమావేశంలో అభ్యర్థుల పేర్ల జాబితాను తయారు చేయాలని కమల్ నాథ్ పట్టుబట్టారు. ఏ సీటులో అభ్యర్థులను ఖరారు చేశారో వారి పేరే ఫైనల్ అని తెలియజేయాలన్నారు. దీంతో సొంతంగా టీమ్ ఏర్పాటు చేసుకుని ఎన్నికలకు సిద్ధమవుతారు అని ఆయన పేర్కొన్నారు.

Read Also: Heart Touching Video : తండ్రీ కూతుళ్ల ఈ వీడియో చూస్తే కంట కన్నీరు రాక తప్పదు

అయితే, రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్రకు మద్దతు ఇవ్వాలని కమల్ నాథ్ విజ్ఞప్తి చేశారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు స్వాగతం పలకడానికి మధ్యప్రదేశ్ ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారు అని చెప్పుకొచ్చారు. మన అధినేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా రోడ్లపై తిరుగుతున్నారు.. అన్యాయం, అణచివేత, దోపిడీపై కాంగ్రెస్ పార్టీ నిర్ణయాత్మక పోరాటం చేస్తుందని ప్రకటించారు. రాహుల్ గాంధీ యాత్ర వచ్చే నెలలో మధ్యప్రదేశ్‌లోకి ప్రవేశించనుంది.

Exit mobile version