Kamal Haasan:రోజుకు రూ. 15 కోట్లా? ఇండియాలో హయ్యెస్ట్ పెయిడ్ హీరో ఎవ్వరో తెలుసా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరో ఎవరనే చర్చ జరిగినప్పుడల్లా రజనీకాంత్, షారుక్ ఖాన్, విజయ్ వంటి పేర్లు వినిపిస్తుంటాయి. కానీ, తాజాగా తమిళ నటుడు, రచయిత యుగి సేతు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ రేసులో అందరినీ దాటేసి కమల్ హాసన్ టాప్‌లో నిలిచారు. ముఖ్యంగా గ్లోబల్ హిట్ ‘కల్కి 2898 AD’ సినిమా కోసం కమల్ అందుకున్న పారితోషికం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా కోసం ఆయన కేవలం 10 రోజుల కాల్‌షీట్స్ కేటాయించగా, నిర్మాత అశ్వినీదత్ ఏకంగా..
Allso Read : Manasa Varanasi: లివింగ్ రిలేషన్‌పై మానస వారణాసి బోల్డ్ కామెంట్స్!
Also Read
రూ. 150 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చినట్లు సమాచారం. అంటే లెక్క ప్రకారం చూస్తే, కమల్ హాసన్ రోజుకు దాదాపు రూ. 15 కోట్లు (సుమారు 2 మిలియన్ డాలర్లు) పారితోషికంగా అందుకున్నారన్నమాట. ఒక సీనియర్ హీరోకు ఈ స్థాయిలో రెమ్యునరేషన్ దక్కడం ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ఇదే మొదటిసారి అని సినీ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం కమల్ హాసన్ ‘కల్కి 2’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్‌లతో కలిసి కీలక సన్నివేశాల్లో నటిస్తున్న ఆయనకు, పార్ట్ 2 కోసం కూడా భారీ మొత్తంలోనే పారితోషికం అందుతోందని టాక్. కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా కమల్ అదిరిపోయే ఫామ్‌లో ఉన్నారు. ఆయన నిర్మించిన ‘అమరన్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించడమే దీనికి నిదర్శనం. ప్రస్తుతం ఆయన చేతిలో క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. 70 ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోలకు గట్టి పోటీనిస్తూ, అటు నటనలోనూ.. ఇటు సంపాదనలోనూ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు లోకనాయకుడు.
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!