మలయాళ ముద్దుగుమ్మ కల్యాణి ప్రియదర్శన్ గురించి పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం తన కెరీర్ విషయంలో చాలా పక్కాగా ప్లాన్ చేస్తోంది. ‘లోక చాప్టర్ 1: చంద్ర’ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో, తన దగ్గరకు వచ్చే కథల విషయంలో ఆమె చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. అయితే, గత కొన్ని రోజులుగా బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటిస్తున్న ‘ప్రలే’ సినిమాతో కల్యాణి హిందీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతోందనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ, తన బాలీవుడ్ ఎంట్రీ పై మనసులో మాట బయటపెట్టింది.
Also Read :Vijay Deverakonda : నిద్రలేని రాత్రులు గడిపా.. ఇన్నాళ్లకు న్యాయం జరిగింది
‘నాకు హిందీ సినిమాలు చేయాలని ఉంది, కానీ మంచి కథ దొరికితేనే ముందడుగు వేస్తాను’ అని కల్యాణి స్పష్టం చేసింది. సినిమా ఏదైనా భాష కంటే అందులోని భావోద్వేగాలే ముఖ్యమని ఆమె నమ్ముతుందట. ‘మంచి కథల విషయంలో నాకు కొంచెం అత్యాశ ఎక్కువే. భాష ఏదైనా సరే, బలమైన స్క్రిప్ట్ ఉంటే తప్పకుండా నటిస్తాను. ఇప్పుడున్న పాన్ ఇండియా ట్రెండ్ వల్ల ప్రేక్షకులు అన్ని భాషల సినిమాలను ఆదరిస్తున్నారు. అందుకే మంచి కథలు ఎప్పుడూ నన్ను వెతుక్కుంటూ వస్తాయని నమ్ముతాను’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె చేతిలో ‘జెనీ’, ‘మార్షల్’ వంటి భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. రణ్‌వీర్ సినిమాలో కల్యాణి కనిపిస్తే మాత్రం ఆమె కెరీర్ మరో లెవల్‌కు వెళ్లడం ఖాయం.
