Dwaraka Tirumala: భక్తులకు షాక్.. చిన వెంకన్న ఆలయంలో అద్దె రూ.800 నుంచి రూ.5 వేలకు పెంపు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dwaraka Tirumala: ఏలూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయం భక్తులకు షాకింగ్ న్యూస్ చెప్పింది.. చిన వెంకన్న ఆలయంలో కల్యాణ మండపాల అద్దెలు భారీగా పెంచింది.. ఇప్పటి వరకు కల్యాణ మండపాల అద్దె రూ.800గా ఉండగా.. ఇప్పుడు రూ.800 నుండి రూ.5 వేల వరకు పెంచనున్నట్టు అధికారులు ప్రకటించారు.. అయితే, పెరిగిన అద్దేపై అభ్యంతరాలుంటే 15 రోజుల్లోగా తెలపాలని భక్తులకు సూచించింది ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయ పాలకమండలి.. కాగా, చిన వెంకన్న ఆలయంలో పెద్ద సంఖ్యలో శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి.. శుభముహూర్తాలు వచ్చాయంటే చాలు.. పెళ్లిళ్లు చేసుకుని జంటలు క్యూ కడుతుంటాయి. కానీ, రూ.800గా ఉన్న కల్యాణ మండపాల అద్దెను ఒకేసారి రూ.5వేలకు పెంచడంపై భక్తులల నుంచి విమర్శలు వస్తున్నాయి.
Read Also: BRS KTR: బీఆర్ఎస్ పార్టీని ప్రజలే గుండెల్లో పెట్టుకుని కాపాడుతారు..
Also Read
- MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
- Meerut Murder: ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. డ్రైవర్‌తో ఎఫైర్.. భర్తను పాముతో కరిపించి చంపేసిన భార్య..
- WHO Cancer Report 2026: ఏడాదికి కోటి మంది మృతి..! క్యాన్సర్‌పై WHO షాకింగ్ నివేదిక..
- KTR: 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తే.. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా.!
మరోవైపు.. ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయంలో ఎన్నికల కోడ్ నిబంధనలు ఉల్లంఘించిన ఉద్యోగులపై దేవస్థానం అధికారులు చర్యలు తీసుకున్న విషయం విదితమే.. ఓ ఉద్యోగిని సస్పెండ్ చేసి, సంబంధిత అధికారికి షోకాజ్ నోటీసు జారీ చేసి, పలువురు సిబ్బందిని విధుల నుంచి తాత్కాలికంగా తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.. ఆలయ కేశాఖండనశాలలో టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యుడు సిద్ధవటం యానాదయ్య ఆధ్వర్యంలో వైసీపీ ‘సిద్ధం’ పేరుతో ముద్రించిన కరపత్రాలను అక్కడ విధులు నిర్వహిస్తున్న క్షురకులకు పంపిణీ చేయడం దుమారం రేపింది.. ఆ కరపత్రాలను క్షురకులు చేతితో పట్టుకొని ఫొటోలు దిగి దేవస్థానంలో ప్రచారం చేయడంతో వారిపై చర్యలకు పూనుకున్న విషయం విదితమే.
తాజావార్తలు
-
MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
-
Meerut Murder: ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. డ్రైవర్‌తో ఎఫైర్.. భర్తను పాముతో కరిపించి చంపేసిన భార్య..
-
The Odyssey: రూ.2000 కోట్ల బడ్జెట్.. నోలన్ మ్యాజిక్కు ఇండియా ఫిదా.. ‘ది ఒడిస్సీ’కి అదిరిపోయే ఓపెనింగ్!
-
Explainer: అట్లాంటిక్ కింద 300°C వేడి నీరు.. సూర్యకాంతి లేకుండా జీవం ఎలా బతుకుతోంది?
-
WHO Cancer Report 2026: ఏడాదికి కోటి మంది మృతి..! క్యాన్సర్‌పై WHO షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్‌తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!